SSMB 29: ఈ రోజైనా రాజమౌళి ఆ అప్డేట్ ఇస్తారా.. మహేష్ బాబు ఫ్యాన్స్ వెయిటింగ్..

Mahesh Babu - Rajamouli -SSMB29: సూపర్ స్టార్  మహేష్ బాబు, రాజమౌళి సినిమా ఎపుడు స్టార్ట్ అవుతుందా అని మహష్ బాబు అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మహేష్ బాబు 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజైనా రాజమౌళి ఈ సినిమాపై ఏదైనా అప్ డేట్ ఇస్తారా అని వెయిటింగ్ చేస్తున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 9, 2024, 08:11 AM IST
SSMB 29: ఈ రోజైనా రాజమౌళి ఆ అప్డేట్ ఇస్తారా.. మహేష్ బాబు ఫ్యాన్స్ వెయిటింగ్..

Mahesh Babu - Rajamouli -SSMB29: మహేశ్ బాబు, రాజమౌళి మూవీ  కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టాడు. అంతేకాదు ఈ సినిమా కోసం స్పెషల్ ట్రెయిన్ అవుతున్నారు. తన లుక్ కూడా మార్చుకున్నాడు. పూర్తిగా గడ్డంతో పెరిగిన జుట్టుతో మహేష్ బాబు లుక్ కేక పుట్టిస్తోంది. అయితే.. గత కొన్ని రోజులు ఈ సినిమా ఎపుడు పూజా కార్యకమ్రాలతో ప్రారంభిస్తారు.ఎపుడు సెట్స్ పైకి వెళుతుందనేది అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. అయితే..మే 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా  అప్డేట్ ఇస్తారనుకుంటే ఉసురు మనిపించారు. అయితే.. ఈ రోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

అయితే.. ఈ సినిమాలో మహేష్ బాబు తప్ప మిగిలిన నటీనటులు ఎవరు ఫైనల్ కాలేదనేది సమాచారం. మరోవైపు ఈ సినిమాలో మహేష్ బాబు సరసన జాన్వీ కపూర్ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. పైగా మహేష్ బాబు, రాజమౌళి వీళ్లిద్దరు శ్రీదేవికి వీరాభిమానులు.అందుకే జాన్వీ పేరును వీళ్లిద్దరు కన్సిడర్ చేసినట్టు సమాచారం. మరోవైపు నాగార్జున ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ సినిమా రేంజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను   తెరకెక్కించడానికి రాజమౌళి ప్రిపేర్ అవుతున్నారు.  ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా కాదు.. ప్యాన్ వరల్డ్ నేపథ్యంలో అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు విజయేంద్ర ప్రసాద్ పలు సందర్భాల్లో ప్రస్తావించిన సంగతి తెలిసిందే కదా.   ఇప్పటికే ఈ సినిమా కథ ఫైనలైజ్ అయిపోయింది. మహేష్ బాబుతో చేయబోయే చిత్రాన్ని నెవర్ బిఫోర్ అనే విధంగా జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు.  ఇప్పటికే ఈ సినిమా కథతో పాటు స్రీన్ ప్లే, డైలాగ్స్ వెర్షన్స్, సినిమాలో స్కెచెస్ కూడా పూర్తి చేసారు.

ఈ సినిమా కోసం మహేష్ బాబు వివిధ లుక్స్ ట్రై చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని టెస్ట్ షూట్స్ నిర్వహించారు. రెండింటిని ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబు పూర్తి స్థాయిలో డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నట్టు సమాచారం. మహేష్ బాబు ఇప్పటి వరకు హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత 'నాని' సినిమా క్లైమాక్స్‌లో మాత్రమే తండ్రీ కొడుకులుగా రెండు పాత్రల్లో మురిపించాడు.  చైల్డ్ ఆర్టిస్ట్ గా  తన తండ్రి దర్శకత్వంలో 'కొడుకు దిద్దిన కాపురం' సినిమాలో రెండు పాత్రల్లో మెరిసాడు.  

విక్రమార్కుడు, బాహుబలి తరహాలో ఈ సినిమాలో రాజమౌళి డ్యూయల్ రోల్లో చూపించాడు. ఇపుడు మహేష్ బాబును రెండు విభిన్న పాత్రల్లో చూపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఇప్పటి వరకు  ఏ హీరో చేయనటువంటి డిఫరెంట్ రోల్ చేయబోతన్నట్టు వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాలో జాతీయ, అంతర్జాతీయ నటీనటులను భాగస్వామిగా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.  ఈ చిత్రాన్ని 2026 సమ్మర్ కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.

ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News