Vijayendra Prasad: కోట్ల మంది తెలుగువారిలో విజయేంద్రప్రసాద్ ను అందుకే ఎంపిక చేశారా?

Reason Behind Vijayendra Prasad Rajya Sabha Seat: విజయేంద్ర ప్రసాద్ కు అనూహ్యంగా రాజ్యసభ సీటు ప్రకటించడంతో ఆయనకు ఈ పరిస్థితుల్లో ఎందుకు రాజ్యసభ సీటు ప్రకటించారు అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విజయేంద్ర ప్రసాద్ ను ఎంచుకోవడం వెనుక ఒక పెద్ద కారణం ఉందని ప్రచారం జరుగుతోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 7, 2022, 08:02 PM IST
  • విజయేంద్ర ప్రసాద్ కు రాజ్యసభ సీటు
  • అందుకేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం
  • ఆ రెండు సినిమాలు చేస్తారంటూ ప్రచారం
Vijayendra Prasad: కోట్ల మంది తెలుగువారిలో విజయేంద్రప్రసాద్ ను అందుకే ఎంపిక చేశారా?

Reason Behind Vijayendra Prasad Rajya Sabha Seat: స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కు అనూహ్యంగా రాజ్యసభ సీటు ప్రకటించడంతో ఆయనకు ఈ పరిస్థితుల్లో ఎందుకు రాజ్యసభ సీటు ప్రకటించారు అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి పదవి గాని లేదా ఉపరాష్ట్రపతి పదవి గాని దక్షిణాది నుంచి ఎవరికైనా దక్కే అవకాశం ఉంటుందని భావించారు. కానీ రెండు పదవులు కూడా ఒకటి ఒరిస్సాకు చెందిన గిరిజన మహిళకు మరొకటి ఉత్తరాదికే చెందిన ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల వారు చిన్నబుచ్చుకోకుండా దక్షిణాదిలో ఉన్న నాలుగు రాష్ట్రాల నుంచి నలుగురిని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక నుంచి విజయేంద్ర హెగ్గడే, తెలుగు రాష్ట్రాల నుంచి విజయేంద్ర ప్రసాద్, తమిళ రాష్ట్రం నుంచి ఇళయరాజా, కేరళ నుంచి పి.టి.ఉషలను ఎంపిక చేశారని అంటున్నారు. 

తెలుగు రాష్ట్రాలలో బీజేపీ తరఫున చాలామంది ఆశావహులు ఉన్నారు. అలాగే సమాజ సేవలో కూడా తలపండిన వారు చాలామంది ఉన్నారు.  కానీ ఇలా విజయేంద్ర ప్రసాద్ ను ఎంచుకోవడం వెనుక ఒక పెద్ద కారణం ఉందని ప్రచారం జరుగుతోంది. నిజానికి విజయేంద్ర ప్రసాద్ ముందు నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తిగా పేరు ఉంది. బాహుబలి ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు చేసిన ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని బాహాటంగానే ఒప్పుకున్నారు కూడా. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ కు సంబంధించి రెండు వార్తలు సోషల్ మీడియాలో కొత్తగా పుట్టుకొచ్చాయి.

ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు కానీ అందులో మొదటి విషయం ఏమిటంటే విజయేంద్ర ప్రసాద్ హైదరాబాద్ కేంద్రంగా ఒకప్పటి నైజాం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన రజాకార్లకు సంబంధించి ఒక సినిమా చేయబోతున్నారని, రజాకారుల అల్లర్లను, కల్లోలాన్ని కళ్ళకు కట్టినట్టు చూపే విధంగా ఆ సినిమా చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఆ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇక మరో ప్రచారం ఏమిటంటే ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగి ఉన్న విజయేంద్ర ప్రసాద్ ఆర్ఎస్ఎస్ ఫౌండర్ హెగ్డేవార్ జీవిత కథను సినిమాగా రూపొందించే అవకాశం ఉందని అంటున్నారు. 

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేయగా ఇప్పుడు కూడా పనిచేస్తున్న ఈ సంస్థ ఎలాంటి పరిస్థితులలో ఏర్పాటు చేయబడింది? దాని లక్ష్యాలు ఏమిటి ఏర్పాటు చేసిన సమయంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనే విషయాలను కూలంకషంగా చూపిస్తూ ఒక సినిమా చేయబోతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. దాన్ని కర్ణాటకకు చెందిన ఒక ప్రముఖ మీడియా సంస్థ ఈ సినిమా నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ రాజమౌళి తండ్రికి రాజ్యసభ సీటు అనగానే ఈ వ్యవహారాలు ఇప్పుడు తెరమీదకు వచ్చాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం అవుతాయి అనేది కాలమే నిర్ణయించాలి మరి.

Also Read: Suchendra prasad: మైసూర్ ఘటన తర్వాత భర్తకు పవిత్ర లోకేష్ ఫోన్.. అవి బయటపెడతానన్న సుచేంద్ర ప్రసాద్!

Also Read: Sammathame OTT: అప్పుడే ఓటీటీకి 'సమ్మతమే'.. స్ట్రీమింగ్‌ ఎ‍ప్పుడు, ఎక్కడో తెలుసా?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News