Stree2: ప్రభాస్ కల్కి రికార్డులను బద్దలు కొట్టిన శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’.. ఇది ఊర మాస్ రచ్చ..

Stree2: చిన్న సినిమా ..అది కూడా లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కిన మూవీ ‘స్త్రీ 2’ . ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో సంచలనం రేపింది. తాజాగా ఈ సినిమా ఈ సినిమా ప్రభాస్ ‘కల్కి’ మూవీ రికార్డులను బ్రేక్ చేసింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 22, 2024, 03:00 PM IST
Stree2: ప్రభాస్ కల్కి రికార్డులను బద్దలు కొట్టిన శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’.. ఇది ఊర మాస్ రచ్చ..

Stree2: శ్రద్ధా కపూర్ టైటిల్ రోల్లో నటించిన నటించిన ‘స్త్రీ’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం ‘స్త్రీ 2’. 2018లో అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రాజ్ అండ్ డీకె, సుమిత్ అరోరా ఈ చిత్రానికి  కథ, మాటలు అందించారు. అప్పట్లోనే ఈ సినిమా సంచలన విజయం సాధించింది. దాదాపు రూ. 25 కోట్ల బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా అప్పట్లో రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇపుడీ మూవీకి సీక్వెల్ గా ‘స్త్రీ 2’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దర్శకుడు అమర్ కౌశిక్. హార్రర్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులను బ్రేక్ చేసింది. హిందీ వెర్షన్ లో ఈ యేడాది మొదటి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా ముందు రోజు ప్రీమియర్స్ ద్వారానే రూ. 9.40 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం తొలి రోజు రూ. 55.40 కోట్ల నెట్ వసూల్లతో దుమ్ము దులిపింది. మొత్తంగా ఫస్ట్ డే ఈ సినిమా రూ. 64.80 కోట్ల వసూల్లతో రికార్డులను తిరగరాసింది.

ఒక లేడీ ఓరియండెట్ ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ లో ‘స్త్రీ 2’ చరిత్ర సృష్టించింది. అంతేకాదు  ఈ సినిమా ఫస్ట్ వీక్ లో ‘కల్కి 2898 ఏడి’ మూవీ హిందీలో కలెక్ట్ చేసిన టోటల్ కలెక్షన్స్ ను క్రాస్ చేయడం విశేషం. కల్కి మూవీ రూ. 300 కోట్ల నెట్ వసూల్లకు అటు ఇటుగా రూ. 288 నెట్ వసూళ్లను రాబడితే..  స్త్రీ 2 మూవీ ఇప్పటికే భారతీయ బాక్సాఫీస్ గా నిన్నటితో 289.60 కోట్ల కలెక్షన్స్ తో కల్కి హిందీ కలెక్షన్స్ న బీట్ చేయడం విశేషం.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shraddha ✶ (@shraddhakapoor)

మొత్తంగా ఈ రోజు రూ 300 కోట్ల నెట్ వసూళ్లను భారతీయ బాక్సాఫీస్ దగ్గర రాబట్టిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతూనే ఉంది. మొత్తంగా శ్రద్ధా కపూర్ నటించిన ‘స్త్రీ 2’ మూవీ ముందు ముందు బాక్సాఫీస్ దగ్గర మరిన్ని రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం అనే ముచ్చట వినిపిస్తోంది. 

ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News