ఆయన వల్లే ఈరోజు ఇలా.. అల్లు అర్జున్ భావోద్వేగం

అనుభవంతో తనకు కొత్త విషయాలు తెలుస్తున్నాయని, ఈరోజు తమ కుటుంబం ఇలా ఉండటానికి కారణం తన తాత, స్వర్గీయ అల్లు రామలింగయ్య అని అల్లు అర్జున్ (Allu Arjun) భావోద్వేగంతో పోస్ట్ చేశారు.

Updated: Jul 31, 2020, 06:06 PM IST
ఆయన వల్లే ఈరోజు ఇలా.. అల్లు అర్జున్ భావోద్వేగం
File photo

తన తాతయ్య, హాస్య దిగ్గజం అల్లు రామలింగయ్యను గుర్తు చేసుకుని టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (All Arjun) భావోద్వేగానికి లోనయ్యాడు. ఓ పేద రైతు అయిన వ్యక్తికి సినిమాల మీద ఆసక్తి కారణంగా మేం ఈరోజు ఇలా ఉన్నామంటూ తాత గురించి కామెంట్ చేశాడు. హాస్య నటుడు అల్లు రామలింగయ్య వర్ధంతి (Allu Ramalingaiah Death Anniversary) నేడు. తెలుగు చిత్ర పరిశ్రమలో తొలితరం హాస్యనటుడిగా నవ్వులు పూయించారు. కొత్త తరాలకు ఆయన ఆదర్శం. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...

‘ఈరోజు తాత మమ్మల్ని వదిలివెళ్లిపోయారు. ఆయన గురించి ఆరోజు కంటే ఇప్పుడు చాలా తెలుసుకున్నాను. నాకు అనుభవం వచ్చేకొద్దీ తాత ((Allu Ramalingaiah) పడ్డ కష్టాలు, ఆయన కృషి, పట్టుదల, ప్రయాణం ఏంటన్నది అర్థమైంది. ఓ పేద రైతు కుటుంబానికి చెందిన వ్యక్తికి సినిమాలపై ఉన్న ఇష్టం కారణంగానే మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటూ’ అల్లు అర్జున్ భావోద్వేగానికి లోనవుతూ ట్వీట్ చేశాడు. Photos: బుల్లితెర రారాణి అంకితా లోఖాండే.. 

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1922 అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జన్మించారు. నాటకాలు ప్రదర్శించే ఆయన సినిమాల్లోనూ రాణించాలని ఎంతో శ్రమించారు. ‘పుట్టిల్లు’ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన అల్లు రామలింగయ్య తనదైన హాస్యంతో, కామెడీ విలనిజంతో మెప్పించారు. 1990లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్నారు. 2004లో జులై 31న అల్లు రామలింగయ్య ఈ లోకాన్ని విడిచారు. నేటికీ సినిమాల్లో ఆయన జీవించే ఉన్నారు.  వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్