Praneeth Hanumanth: నవ దళపతి సుధీర్ బాబు హీరోగా.. జ్ఞాన సాగర ద్వారక దర్శకత్వం వహించిన చిత్రం హరోం హర. మాళవిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం గత నెల 14వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు ముందు విడుదల చేసిన టీజర్, పోస్టర్ అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇదిలా ఉండగా.. ఈనెల 11వ తేదీన ఆహా , ఈటీవీ విన్ యాప్ లలో స్ట్రీమింగ్ కి రావాల్సి ఉంది.. కానీ సాంకేతికలోపం వల్ల సినిమా స్ట్రీమింగ్ ఆగిపోయింది అనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రముఖ యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ వల్లే ఓటీటీ స్ట్రీమింగ్ ఆగిపోయిందని సమాచారం.
గత నాలుగు రోజులుగా యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాడో అందరికీ తెలిసిందే. తండ్రి కూతుళ్ళకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. తప్పుగా దానిని చిత్రీకరిస్తూ.. డిబేట్ పెట్టి మరీ స్నేహితులతో నవ్వుతూ ఎగతాళిగా అసభ్య పదజాలం వాడుతూ రెచ్చిపోయారు.
ఈ వీడియో కాస్త హీరో సాయిధరమ్ తేజ్ వరకూ చేరడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం.. చేయడమే కాదు ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తల్లిదండ్రులకు హెచ్చరిక జారీ చేస్తూ.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులకు, డిప్యూటీ ముఖ్యమంత్రులకు ఇలాంటి సోషల్ మీడియా మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని కోరారు.
ఈ మేరకు తెలంగాణ పోలీస్ యంత్రాంగం అతడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ నేపథ్యంలోని ఇలాంటి వ్యక్తి తమ సినిమాలో ఉన్నాడని తెలిస్తే ఎవరు చూడరని.. తమకు చెడ్డ పేరు వస్తుందని ఆలోచించిన నిర్మాతలు.. అతడు చేసిన సన్నివేశాలను సినిమా నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే సినిమాలో అతడి సన్నివేశాలను తీసేసి ఆ తర్వాత సినిమాను ఆహ , ఈటీవీ విన్ యాప్ లలో స్ట్రీమింగ్ చేయబోతున్నారని సమాచారం.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై.. సుమంత్ జి నాయుడు.. నిర్మించిన ఈ సినిమా త్వరలోనే స్ట్రీమింగ్ కి సిద్ధం కానుంది. ఏదేమైనా ఇలాంటి మానవ మృగాలకు కఠిన శిక్ష పడాలి.. అని అటు సెలబ్రిటీలు, రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకున్నారు.. అందులో భాగంగానే అతడిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. మొత్తానికి అయితే అతడు నటించిన సన్నివేశాలను కూడా సినిమా నుంచి తొలగించబోతున్నట్లు తెలుస్తోంది.అందుకే హరోంహర ఓటిటి వాయిదా పడినట్లు సమాచారం.
Read more: Snakes smuggling: అక్కడ ఎలా దాచావ్ భయ్యా.. ప్యాంటులో 100 కు పైగా బతికున్న పాములు.. వీడియో వైరల్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి