Sunitha Boya Nude Protest: బన్నీ వాసు మోసం చేశాడంటూ నగ్నంగా నిరసనకు దిగిన నటి సునిత

Sunitha Boya Nude Protest: మా అసోసియేషన్‌లో సభ్యత్వం విషయమై ఫిలిం చాంబర్ ఎదుట నగ్నంగా నిరసన చేపట్టి తెలుగు సినీ పరిశ్రమలో సమస్యలపై యుద్ధం ప్రకటించిన శ్రీరెడ్డి టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2022, 10:52 PM IST
  • గీతా ఆర్ట్స్ ఆఫీసు ఎదుట నటి సునీత బోయ అర్ద నగ్న నిరసన
  • బన్నీ వాసు మోసం చేశాడంటూ ఆందోళనకు దిగిన సునీత బోయ
  • తనకు న్యాయం చేయాల్సిందిగా సునీత బోయ నిరసన
Sunitha Boya Nude Protest: బన్నీ వాసు మోసం చేశాడంటూ నగ్నంగా నిరసనకు దిగిన నటి సునిత

Sunitha Boya Nude Protest: శ్రీరెడ్డి న్యూడ్ ప్రొటెస్ట్ ఉదంతం గతంలో సంచలనం సృష్టించిన తరహాలోనే తాజాగా మరో నటి ఓ సినీ నిర్మాతపై నిరసన వ్యక్తంచేస్తూ నగ్నంగా రోడ్డెక్కింది. ఆ ప్రోడ్యూసర్ ఎవరో కాదు.. తెలుగులో పలు హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి, డిస్ట్రిబ్యూటర్ గానూ పదుల సంఖ్యలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చిన బన్నీ వాసు. అవును బన్నీ వాసు తనను మోసం చేశాడని ఆరోపిస్తూ గీతా ఆర్ట్స్ ఆఫీసు ఎదురుగా నటి సునిత బోయ నగ్న ప్రదర్శనకు దిగారు. నటి సునీత బోయ అర్ద నగ్న నిరసన ప్రదర్శనతో గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఎదుట ఆందోళనకర వాతావరణం నెలకొంది.

గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఎదుట నిరసన ఎందుకు ?

బన్నీ వాసు గీతా ఆర్ట్స్‌తోనే తన సినీ కెరీర్‌ని మొదలుపెట్టారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో బన్ని వాసుకు ఉన్న సాన్నిహిత్యం అతడిని డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా ఎదిగేలా చేసిందని అతడి గురించి తెలిసిన వాళ్లు చెబుతుంటారు.  గీతా ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి బన్నీ వాసు పలు చిత్రాలు కూడా నిర్మించారు. ఈ కారణంగానే నటి సునీత బోయ గీతా ఆర్ట్స్ ఆఫీసు ఎదుట ధర్నాకు దిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఏదేమైనా.. నటి సునీత బోయ న్యూడ్ ప్రొటెస్ట్ ఘటన మరొకసారి శ్రీరెడ్డి న్యూడ్ ప్రొటెస్ట్ ఘటనను గుర్తుచేసింది. కాకపోతే శ్రీరెడ్డి మొత్తం తెలుగు సినిమా సమాజంపైనే గళమెత్తగా.. నటి సునీత బోయ మాత్రం బన్నీ వాసు తనను మోసం చేశాడంటూ ఆయనపైనే నిరసనకు దిగింది. మరి ఈ వివాదం ఇంతటితో సద్దుమణిగేనా లేక ఈ ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అయ్యేనా అనేది వేచిచూడాల్సిందే.

Also Read : Krishna Bronze Statue: తండ్రి కోసం 30 అడుగుల కాంస్య విగ్రహం, మ్యూజియం ఏర్పాటుకు మహేశ్ నిర్ణయం

Also Read : Liger Movie: పూరీ, ఛార్మీలకు లైగర్ కొత్త కష్టాలు, ఈడీ విచారణకు హాజరైన ఇద్దరు నిర్మాతలు

Also Read : Sudigali Sudheer : జబర్దస్త్ షోను అందుకే వదిలేశా.. ఆఫీస్ బాయ్‌గా అయినా చేస్తా.. సుడిగాలి సుధీర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News