Gadar-2 Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'గదర్‌-2'.. స్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

Gadar-2 Movie: సన్నీ డియోల్ టైటిల్ రోల్ చేసిన గదర్‌-2 మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఇది ఎప్పడు, ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుందంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 5, 2023, 06:27 PM IST
Gadar-2 Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'గదర్‌-2'.. స్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

Gadar-2 Movie OTT Release date: ఈ ఏడాది బాలీవుడ్  బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌లలో గదర్‌-2 ఒకటి. సన్నిడియోల్(Sunny Deol), అమీషా పటేల్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్స్ ను సాధించింది. ఈ మూవీ రూ.500 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. బి.సి సెంటర్‌ల ఆడియెన్స్ ను మెప్పించగలిగితే సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ఈ సినిమా చేసి చూపించింది. రిలీజై రెండు నెలలు గడుస్తున్నా ఈ మూవీ ఇంకా థియేటర్లలో గర్జిస్తూనే ఉంది. ఈ మూవీ ఎప్పుడెప్పుడా ఓటీటీలోకి వస్తుందా అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. అక్టోబరు 06 నుంచి ఈ సినిమా జీ-5 వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆఫిషియల్ ప్రకటించారు మేకర్స్.  ఈ సినిమాను జీ స్టూడీయోస్‌తో కలిసి దర్శకుడు అనీల్ శర్మ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 

2001లో వచ్చిన 'గదర్: ఏక్ ప్రేమ్ కథ' చిత్రానికి రీమేక్ గా గదర్ 2 తెరకెక్కింది. 1947లో పాకిస్థాన్ విభజన నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమాకు అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. అప్పట్లో 13 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ 130 కోట్లకు పైగా వసూలు చేసింది. మళ్లీ 22 ఏళ్ల తర్వాత వచ్చిన గదర్ 2కు కూడా అనిల్ శర్మ డైరెక్షన్ చేయడం విశేషం. ఈ రీమేక్ లో సన్నీ డియోల్, అమీషా పటేల్ మరియు ఉత్కర్ష్ శర్మ తమ పాత్రలను తిరిగి పోషించారు. శక్తిమాన్ తల్వార్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందించారు. 

మరోవైపు సన్నీ డియోల్‌.. అమీర్‌ ఖాన్ ప్రొడక్షన్‌లో ఓ సినిమాకు ఓకే చెప్పాడు. ఈ చిత్రానికి రాజ్‌ కుమార్‌ సంతోషి దర్శకత్వం వహించనున్నారు. 1947 ఇండియా పాకిస్థాన్ విభజన సమయంలో లక్నో నుంచి లాహోర్ వెళ్లిన శరణార్ధుల విషాద పరిణామాల చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా ఉండబోతుందని టాక్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుుంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. 

Also Read: Devara Update: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రెండు భాగాలుగా 'దేవర'...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News