Kanguva: సూర్య సినిమా అప్డేట్ వచ్చేసింది..పాన్ వరల్డ్ మూవీగా రానున్న 'కంగువ'..

Suriya Kanguva: తమిళం తో పాటు తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరో సూర్య. ఈ హీరో త్వరలోనే పాన్ వరల్డ్ సినిమాతో మన ముందుకి రానున్నారు. ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2024, 06:50 PM IST
Kanguva: సూర్య సినిమా అప్డేట్ వచ్చేసింది..పాన్ వరల్డ్ మూవీగా రానున్న 'కంగువ'..

Kanguva Update: హీరో సూర్యకి తమిళం తో పాటు తెలుగులో కూడా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. తమిళ ప్రేక్షకులు ఈ హీరోని ఎంతగా ఆదరిస్తారో తెలుగు ప్రేక్షకులు కూడా తమ సొంత హీరోగా అభిమానిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సూర్య కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో  త్వరలో రాబోతున్న కంగువా సినిమా పైన తెలుగు, తమిళ భాషలలో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. 

పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా వస్తున్న ఈ సినిమాకి శివ దర్శకత్వం వహిస్తున్నారు. దిశా పటానీ హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాలో బాబీ డియోల్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా 'కంగువ' సినిమా గురించి సరికొత్త అప్డేట్ వచ్చింది. అదేమిటి అంటే పాన్ వరల్డ్ గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ చేశారు హీరో సూర్య. డబ్బింగ్ వర్క్స్ జరుగుతున్న అద్నాన్ ఆర్ట్స్ స్టూడియోస్ లో హీరో సూర్యతో డైరెక్టర్ శివ, ఇతర టెక్నీషియన్స్ ఫొటో తీసుకున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్న ఈ చిత్రం మొత్తం పైన పది భాషల్లో తెరకెక్కుతుంది. కాగా ఈ చిత్రంలో వరల్డ్ క్లాస్ మేకింగ్, సూర్య పర్ ఫార్మెన్స్ హైలైట్ కానుంది అని అంటున్నారు ఈ సినిమా నిర్మాతలు. హీరో సూర్య కెరీర్ లో హై బడ్జెట్ మూవీగా రూపొందుతున్న 'కంగువ' ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఒక స్పెషల్ ఫిల్మ్ కావడం ఖాయం అని అభిమానులు కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు.

రాక్ స్టార్ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వెట్రి పళనిస్వామి, ఎడిటర్ గా నిశాద్ యూసుఫ్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం విడుదలై ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.

Also Read: TDP JanaSena: పార్టీ వీడేవారికి చంద్రబాబు కీలక సూచన.. భవిష్యత్‌కు 'గ్యారంటీ' ప్రకటన

Also Read: New Party: ఆంధ్రప్రదేశ్‌లో మరో పార్టీ.. స్థాపించింది ఎవరు? ఎన్నికల్లో పోటీ చేస్తుందా?

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News