Tamil Actor Mohan death: భారతీయ సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది చాలా మంది సెలెబ్రిటీలు మృత్యువాత పడ్డారు. రీసెంట్ గా బాలీవుడ్ దిగ్గజ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంతలోనే మరో నటుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో సహాయకపాత్రలో నటించిన మోహన్ కన్నుమూశారు. ఆయన మృతదేహం రోడ్డు పక్కన లభించిందని పోలీసులు తెలిపారు.
తమిళనాడులోని మధురై జిల్లా తిరుప్పాంగుండ్రం రోడ్డు పక్కన ఎవరిదో మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు ఆ డెడ్ బాడీని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేశారు. దీంతో ఆ మృతి చెందిన వ్యక్తి నటుడు మోహన్ గా గుర్తించారు. విచిత్ర సోదరులు సినిమాలో కమల్ హాసన్ కు ఫ్రెండ్ గా నటించాడు. ఈ సినిమాతోపాటు నాన్ కడవుల్, అదిశయ మనిదర్గళ్లాంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు మోహన్. ఇతడి స్వస్థలం సేలం జిల్లా మేటూర్.
మోహన్ ఎలా చనిపోయాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతడు సేలం నుంచి మధురై ఎందుకు వెళ్లాడు, అతడు ఎలా చనిపోయాడనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అంతేకాకుండా మోహన్ మరణ వార్తను ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే మోహన్ అవకాశాల కోసం మదురైకు వచ్చాడని.. అవకాశాల రాకపోవడం వల్ల మదురైలోని రోడ్లపై బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూన్నాడని.. పేదరికం వల్లే అతడి మరణించి ఉంటాడని చాలా మంది భావిస్తున్నారు. మోహన్ మృతికి పలువురు సంతాపం తెలియజేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook