Vijay in AK 62: స్టార్ హీరో సినిమాలో విల‌న్‌గా విజ‌య్.. ముచ్చటగా మూడోసారి!

Vijay Sethupathi in Ajith Kumar Next Film. విజ‌య్ సేతుప‌తి మూడో సారి విల‌న్ పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు ఫిల్మ్ నగర్ స‌మాచారం. అజిత్ హీరోగా చేస్తున్న సినిమాలో విజ‌య్ కీలక పాత్ర చేస్తున్నట్లు సమాచారం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 03:23 PM IST
  • స్టార్ హీరో సినిమాలో విల‌న్‌గా విజ‌య్
  • ముచ్చటగా మూడోసారి
  • విలన్ పాత్రలు బాగా హైలెట్
Vijay in AK 62: స్టార్ హీరో సినిమాలో విల‌న్‌గా విజ‌య్.. ముచ్చటగా మూడోసారి!

Vijay Sethupathi to play villain role in Ajith Kumar 62 Movie: తమిళ హీరో 'మక్కల్ సెల్వన్' విజ‌య్ సేతుప‌తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు విల‌న్‌గా అదరగొడుతున్నాడు. పాత్ర నచ్చితే క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా కూడా న‌టించ‌డానికి సిద్దంగా ఉన్నాడు. వెరైటీ కథలను ఎంచుకునే విజ‌య్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. 'ఉప్పెన' సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో అలరించాడు. విల‌న్‌గా ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. 

దళపతి విజయ్ నటించిన 'మాస్ట‌ర్‌' సినిమాలో కూడా విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా నటించిన విషయం తెలిసిందే. మాస్ట‌ర్‌లో ఆయన విల‌నిజంకు ప్రేక్ష‌కుల, విమర్శకుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇక విజ‌య్ సేతుప‌తి ముచ్చ‌ట‌గా మూడో సారి విల‌న్ పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు ఫిల్మ్ నగర్ స‌మాచారం. విఘ్నేష్ శివ‌న్ దర్శకత్వలో 'తలా' అజిత్ హీరోగా చేస్తున్న సినిమాలో విజ‌య్ సేతుప‌తి కీలక పాత్ర చేస్తున్నట్లు సమాచారం. 

అజిత్ హీరోగా తెరెక్కుతున్న ఏకే 62 సినిమాలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టించ‌డానికి మేక‌ర్స్ విజ‌య్ సేతుప‌తిని సంప్రదించార‌ట‌. విలన్ క్యారెక్టర్ న‌చ్చ‌డంతో మక్కల్ సెల్వన్ వెంట‌నే ఓకే చెప్పినట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది. విజయ్ ఇప్పటివరకు చేసిన రెండు విలన్ పాత్రలు బాగా హైలెట్ అయ్యాయి. ఏకే 62లో ఆయన పాత్ర బాగుంటుందని సమాచారం.    

విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ సేతుప‌తి ఇదివరకు నటించిన విషయం తెలిసిందే. ననున్ రౌడీనే, కాతువాకుల రెండు కాదల్ సినిమాల్లో విజ‌య్ నటించాడు. ఇటీవల విడుదలైన కాతువాకుల రెండు కాదల్ సినిమా మంచి విజయం అందుకుంది. విజయ్ సేతుపతి సరసన నయనతార, సమంత నటించారు. ముక్కోణపు ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ అందించిన సంగీతం హెల్ప్ అయింది. 

Also Read: Funny Video: అసలే సమ్మర్, ఆపై విద్యుత్ కోతలు.. ఉక్కపోత తట్టుకోలేక ఈ వ్యక్తి ఏం చేశాడో చుడండి!

Also Read: Viral News: తన మూత్రాన్ని తానే తాగుతున్న యువకుడు... ఇది 'నిత్య యవ్వన' సీక్రెట్ అట...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News