రివ్యూ: తంత్ర (Tantra)
నటీ నటులు: అనన్య నాగళ్ల, ధనుశ్ రఘుముద్రి, సలోని, మీసాల లక్ష్మణ్, టెంపర్ వంశీ, మనోజ్ ముత్యం తదితరులు
సంగీత దర్శకుడు: ఆర్ఆర్ ద్రువన్
సినిమాటోగ్రాఫర్: శ్రీరామ్ ఉద్ధవ్
ఎడిటర్ : SB ఉద్దవ్
నిర్మాత: నరేష్ బాబు, రవి చైతన్య
దర్శకత్వం: శ్రీనివాస్ గోపిశెట్టి
Tantra Moview Review: గత కొన్నేళ్లుగా తెలుగులో హార్రర్ థ్రిల్లర్ మూవీస్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ కోవలో వచ్చిన మరో హార్రర్ థ్రిల్లర్ మూవీ 'తంత్ర'. అనన్య నాగళ్ల లీడ్ రోల్లో యాక్ట్ చేసిన ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
తంత్ర స్టోరీ విషయానికొస్తే.. రేఖ (అనన్య నాగళ్ల) ఒక పల్లెటూరి అమ్మాయి. కాలేజ్ వెళ్లి చదువుకుంటూ ఉంటుంది. అదే ఊళ్లో అనాథ అయిన తేజు(ధనుశ్ రఘుముద్రి)ను ప్రేమిస్తూ ఉంటుంది. అతను కూడా కాలేజీ చదువుతూనే ఊర్లో అందరికీ చేదోడు వాదోడుగా ఉంటాడు. ఈ క్రమంలో రేఖకు విచిత్రమైన పరిస్థితి ఎదర్కొంటూ ఉంటుంది. ఈమెకు ప్రతి పౌర్ణమి రోజు.. తన రక్తాన్ని క్షుద్ర దేవతకు బలి ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలో రేఖపై ఒక తాంత్రిక విద్యలు తెలిసిన వ్యక్తి ఆమె పై చేతబడి చేస్తాడు. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలేమిటి? అందులోంచి రేఖ ఎలా బయట పడింది. ఈ క్రమంలో దుష్ట శక్తులను దేవీ శక్తులు తోడ్పాటు అందించయనేదే తంత్ర మూవీ స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్ అపుడెపుడో రాసిన తులసీ దళం, కాశ్మోరా వంటి సినిమాలను చూసి తంత్ర మూవీ కథను రాసుకున్నట్టు కనిపిస్తోంది. దీనికి మన పురాణాల్లో ఉన్న తాంత్రిక విద్యలపై కొంత అవగాహన పెంచుకొని ఈ సినిమా కథను రాసుకున్నాడు. ముఖ్యంగా మన పురాణాల్లో రామ రావణ యుద్ధంలో రావణుడికి కుమారుడైన మేఘనాథుడు, క్షుద్ర పూజలకు ఆలవాలమైన నికుంబళ దేవికి పూజ చేస్తున్నడు లక్ష్మణుడు ఆ పూజను పూర్తి కాకుండా వానర సైన్యంతో అడ్డకున్నాడు. అలా ఇంద్రజిత్తుపై లక్ష్మణుడు విజయం సాధించాడనే కాన్సెప్ట్ ను ఈ సినిమాలో ఓ పాత్ర ద్వారా చెప్పించి తాంత్రిక విద్యలనేవి అనాదిగా వస్తున్న విషయాన్ని ఈ సినిమాలో ప్రస్తావించాడు. మరోవైపు తాంత్రిక విద్యలను చూసిస్తూనే తంత్ర విద్యల్లోని వశీకరణం, పాతాళ భట్టీ, శత్రువు ఆగమనం, ముసుగులో మహంకాళి, వజ్రోలి రతి,ఛినమస్తాదేవి వంటి తాంత్రిక విద్యలను ఇందులో ప్రస్తావించాడు.
ముఖ్యంగా దైవీ పూజల్లో దక్షిణాచారం, వామాచారం అనే రెండు పూజలను ప్రస్తావించాడు. అంతేకాదు తాను చెప్పదలచుకున్న విషయాన్ని కాస్త లెంగ్తీగా చెప్పడం బోరింగ్ కలిగిస్తోంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ మధ్య రొమాన్స్ ప్రేక్షకులను ఇబ్బంది కలిగించినా.. ఆ తర్వాత సినిమాను ఓ టెంపో మెయింట్ చేసాడు. చివరి కంటూ సస్పెన్స్ మెయింటెన్ చేయడం ఆసక్తి కలిగిస్తోంది. అంతేకాదు మనం నిత్యం ఇంటి ముందు వేసే ముగ్గు, వాహానాలకు నిమ్మకాయలు కట్టడం, దిష్టి తీయడం వంటివి తాంత్రిక విద్యలో భాగాలే అంటూ చూపించడం కాస్త ఇంట్రెస్టింగ్ కలిగిస్తోంది.
వామాచారం ఈ తాంత్రిక విధానంలో బాగం. దీనిని అఘోరాలు చేస్తారు. వాళ్ళు చేసేది పాజిటివ్ గా వుంటుంది. కానీ మన ఆలోచన క్షుద్రమైతే ఈ తాంత్రిక పూజ క్షుద్రపూజ అయిపోతుందన్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రతి తాంత్రిక పూజ నెగిటివ్ కాదన్నట్టు చూపించారు. ముఖ్యంగా ఈ సినిమా దర్శకుడు కథ కోసం ఎంతో శోధించాడనే విషయం ఈ సినిమా చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా తాంత్రిక పూజలోని పాజిటివ్ నెస్ చూపించే ప్రయత్నం చేసాడు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.
నటీనటుల విషయానికొస్తే..
అనన్య నాగళ్ల అమాయక పల్లెటూరి అమ్మాయిగా ఒదిగిపోయింది. క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని సీన్స్‌లో అన్యన నటన మరో లెవల్లో ఉంది. అటు నటన, గ్లామర్ పరంగా అనన్య మంచి మార్కులే కొట్టేసింది. ఇంకాస్త కష్టపడితే.. టాప్ లీగ్‌లోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అటు హీరోగా నటించిన ధనుశ్ రఘుముద్రి కొత్తవాడైన పర్వాలేదనిపించాడు. ఇప్పటి వరకు అమ్రిష్ పూరి, రామిరెడ్డి వంటి వాళ్ల పోషించి తాంత్రికుల వేషంలో చూసిన మనకు టెంపర్ వంశీ అంతగా ఆనడు. కానీ ఉన్నంతలో మాంత్రికుడిగా అదరగొట్టేసాడు. ఈ సినిమాలో హీరో .. అంకుల్ పాత్రలో నటించిన లక్ష్మణ తన పాత్రలో జీవించాడు. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్
కథనం
సినిమాటోగ్రఫీ
ఇంటర్వెల్ బ్యాంగ్
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్ ల్యాగ్
ఎడిటింగ్
రేటింగ్.. 2.75/5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter