Ashiesh Roy: అనారోగ్యంతో టీవీ నటుడు క‌న్నుమూత‌

ఈ ఏడాది సినీ ఇండ‌స్ట్రీని తరచూ విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ప్రముఖ టెలివిజన్ న‌టుడు ఆశీష్ రాయ్ (55) (Ashiesh Roy) అనారోగ్యంతో క‌న్నుమూశారు.

Last Updated : Nov 24, 2020, 02:59 PM IST
Ashiesh Roy: అనారోగ్యంతో టీవీ నటుడు క‌న్నుమూత‌

Television Actor Ashiesh Roy dies due to Kidney failure: ఈ ఏడాది సినీ ఇండ‌స్ట్రీని తరచూ విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ప్రముఖ టెలివిజన్ న‌టుడు ఆశీష్ రాయ్ (55) (Ashiesh Roy) అనారోగ్యంతో క‌న్నుమూశారు. గత కొంతకాలం నుంచి మూత్ర పిండాల వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆశీష్ రాయ్ మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటలకు మరణించారు. దాదాపు 8 నెలలుగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆశీష్ రాయ్ ముంబై (Mumbai) లోని తన నివాసంలో తుదిశ్వాస (Ashiesh Roy passes away) విడిచారు. వైద్యం చేయించుకునేందుకు డ‌బ్బు కూడా సరిగా లేక‌పోవ‌డంతోనే రోజురోజుకి ఆయన ఆరోగ్యం క్షీణించి క‌న్నుమూశారని ఆశీష్ డ్రైవర్ పేర్కొన్నారు. శనివారమే డయాలసిస్ చేయించామని మళ్లీ మంగళవారం ఆసుపత్రికి వెళ్లాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. Also read : EPFO Life Certificate: పెన్షనర్లకు గుడ్ న్యూస్.. 

2019లో పక్షవాతం బారిన పడిన ఆశిష్.. 2020 మే లో ఆసుప‌త్రిలో చేరారు. అప్పుడు వైద్యం చేయించుకునేందుకు డబ్బు లేకపోవడంతో.. ఆశీష్ తనకు సాయం చేయాలంటూ సోషల్‌మీడియాలో కోరారు. అప్పుడు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు మందుకొచ్చి సాయం అందించారు. అప్పటినుంచి ఆశీష్ డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించడంతో మరణించారు. 

అయితే.. ఆశిష్ రాయ్ ప్రముఖ టెలివిజన్ షోలు.. బనేగి అప్ని బాత్, సాసురల్ సిమార్ కా, రీమిక్స్, కుచ్ రంగ్ ప్యార్ కే ఐసే భీ, తదితర వాటిల్లో నటించారు. దీంతోపాటు హోమ్ డెలివరీ, ఎమ్‌పి 3: మేరా పెహ్లా పెహ్లా ప్యార్, రాజా నట్వర్‌లాల్ చిత్రాల్లో సైతం నటించారు. ఆయ‌న మృతికి పలువురు ప్ర‌ముఖులు సంతాపం ప్రకటించారు. Also read: Shanvi Srivastava: బికినీలో రెచ్చిపోయిన ‘లవ్లీ’ బ్యూటీ శాన్వీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News