Dubbing Artist Murthy : ఇండస్ట్రీలో విషాదం.. డబ్బింగ్ ఆర్టిస్ట్ మూర్తి కన్నుమూత

Dubbing Artist Srinivasa Murthy Passes Away తమిళ హీరోల డబ్బింగ్ సినిమాలు, వారి వాయిస్‌లకు స్పెషల్ గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే ఆ హీరోలందరికీ వాయిస్ చెప్పేది ఒకే వ్యక్తి.ఆయనే మూర్తి. ఆయన నేడు కన్నుమూశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2023, 11:46 AM IST
  • టాలీవుడ్‌లో మరో విషాదం
  • డబ్బింగ్ ఆర్టిస్ట్ మూర్తి కన్నుమూత
  • తమిళ హీరోలకు డబ్బింగ్ చెప్పే మూర్తి మృతి
Dubbing Artist Murthy : ఇండస్ట్రీలో విషాదం.. డబ్బింగ్ ఆర్టిస్ట్ మూర్తి కన్నుమూత

Dubbing Artist Srinivasa Murthy Passes Away తమిళ హీరోల సినిమాలు చూసేటప్పుడు ఓ వాయిన్ మనల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది. హీరో ఎవరైనా కూడా వారి ఇమేజ్‌కు తగ్గట్టుగా, పాత్రకు తగ్గట్టుగా ఓ వాయిస్ వినిపిస్తుంది. ఇక ఆ వాయిస్ వినిపించదు. ఆ గొంతును అరువిచ్చే శ్రీనివాస్ మూర్తి నేడు కన్నుమూశారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ మూర్తి హార్ట్ అటాక్‌తో నేడు తుది శ్వాస విడిచారు. అజిత్, విక్రమ్, సూర్య, మోహన్ లాల్ ఇలా హీరో ఎవరైనా కూడా వినిపించే వాయిస్ మాత్రం ఒకటే. ఇకపై డబ్బింగ్ సినిమాల్లోని హీరోల వాయిస్ ఎలా ఉంటుందో తలుచుకుంటూనే గుండె బరువెక్కిపోతోంది.

 

ఆయన లైవ్‌లో డబ్బింగ్‌లు చెబుతుంటే కచ్చితంగా తమిళ హీరోలు మన ముందు నిల్చున్నట్టు అనిపిస్తుంది. సూర్య సినిమాలను విభిన్న రీతుల్లో చెబుతుంటే అలా చెవులు రిక్కించి వింటూనే ఉంటాం. డబ్బింగ్ ఆర్టిస్టులకు తగినంతగా గుర్తింపు ఉండదు. కానీ మూర్తి చెప్పే డబ్బింగ్ విధానం, వేరియేషన్స్‌తో సోషల్ మీడియాలో ఆయనకు విపరీతమైన పాపులారిటీ ఉంటుంది.

మరి తమ సినిమాలకు, తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పి మరో మెట్టు ఎక్కించిన ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ పట్ల తమిళ హీరోలు సంతాపాన్ని వ్యక్తం చేస్తారా? లేదా? అన్నది చూడాలి. ఆయన నేడు చెన్నైలోని స్వగృహంలోనే మరణించారు. గుండెపోటుతో ఆయన కన్నుమూసినట్టు అయితే తెలుస్తోంది. ఇక నేడు జమున కూడా మరణించిన సంగతి తెలిసిందే. ఇలా ఒకే రోజు రెండు విషాదాలు నెలకొనడంతో ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది.
Also Read:  jamuna death : టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటి జమున కన్నుమూత

Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News