Leo Bloody Sweet : అరెరె భలె కుదిరిందే.. అంతా యాదృశ్చికం.. విజయ్, త్రిష విషయంలో మ్యాజిక్

Leo Bloody Sweet లోకేష్ కనకరాజ్, దళపతి విజయ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ నిన్న వైరల్ అయిన సంగతి తెలిసిందే. విజయ్ 67వ సినిమాగా రాబోతోన్న లియో బ్లడీ స్వీట్ గ్లింప్స్ నిన్న ట్రెండ్ సెట్ చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2023, 08:14 PM IST
  • విజయ్, త్రిషలకు 67వ సినిమాగా లియో
  • లోకేష్ కనకరాజ్ సినిమాతో జరిగిన మ్యాజిక్
  • చివరకు T67 అంటోన్న నెటిజన్లు
Leo Bloody Sweet : అరెరె భలె కుదిరిందే.. అంతా యాదృశ్చికం.. విజయ్, త్రిష విషయంలో మ్యాజిక్

Thalapathy 67 and Trisha 67 సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఉండే అంత స్పాన్.. హీరోయిన్లకు ఉండదు. హీరోలకు దాదాపు ముప్పై నలభై ఏళ్లు సమయం ఉంటే.. హీరోయిన్‌కు మహా అంటే పదేళ్లు ఉంటాయి. కొంత మంది పదిహేనేళ్లైనా కూడా తమ తమ స్టార్డంను కొనసాగిస్తుంటారు. ఇక ఇప్పటి హీరోయిన్లు అయితే మహా అంటే ఇరవై ముప్పై సినిమాల్లో నటిస్తే ఎక్కువ. ఇప్పుడు హీరోయిన్ల సినిమాల నంబర్ యాభై, వందకు చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు.

కానీ త్రిష ఇప్పుడు దళపతి విజయ్‌కు సరిసమానంగా పోటీ ఇస్తోంది. విజయ్ ఇప్పుడు లోకేష్‌తో చేస్తోన్నది 67వ సినిమా. అలానే త్రిషకు కూడా ఇది 67వ సినిమానే అట. ఇది అనుకోకుండా జరిగినట్టుంది. ఇలా ఇద్దరిదీ 67వ సినిమా అవ్వడం నిజంగానే  యాదృశ్చికం. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇచ్చారు.

 

ఇప్పుడు ఇలా ఈ ఇద్దరికీ 67వ సినిమానే కావడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. అసలే లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీ నుంచి రాబోతోన్న ఈ సినిమా మీద భారీ హైప్ పెరిగింది. నిన్న రిలీజ్ చేసిన టైటిల్ ప్రోమో వైరల్ అయింది. లియో బ్లడీ స్వీట్ అంటూ రిలీజ్ చేసిన వీడియో మిలియన్ల వ్యూస్‌తో దుమ్ములేపేసింది.

విజయ్ త్రిషది లక్కీ పెయిర్. ఇక లోకేష్‌ కనకరాజ్‌ది గోల్డెన్ హ్యాండ్. ఆల్రెడీ మాస్టర్ అంటూ హిట్ కొట్టేశారు. ఇప్పుడు విక్రమ్ సక్సెస్‌తో ఊపు మీదున్నాడు. అలా ఈ ముగ్గురి కాంబోలో రాబోతోన్న లియో మీద భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ టీం ఇప్పుడు కొత్త షెడ్యూల్ కోసం కాశ్మీర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.

Also Read:  Butta Bomma Movie Review: అనిఖా సురేంద్రన్- అర్జున్ దాస్ 'బుట్టబొమ్మ' రివ్యూ... హిట్ కొట్టారా?

Also Read: NTR 30 Update : డెడ్ లైన్ పెట్టిన ఎన్టీఆర్.. సిద్దంగా ఉన్న కొరటాల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News