Thalapathy Vijay: తమిళ స్టార్ విజయ్ పుట్టినరోజు వేడుకల్లో అపశృతి.. వీడియో వైరల్..

Thalapathy Vijay birthday: త‌మిళ స్టార్  ద‌ళ‌ప‌తి విజ‌య్ పుట్టిన‌రోజు వేడుకల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.  చెన్నైలో జరిగిన వేడుకల్లో ఒక బాలుడు స్టంట్ కోసం ప్రయత్నించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 23, 2024, 04:39 PM IST
  • తమిళ హీరో బర్త్ డేలో ఊహించని ఘటన..
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు..
Thalapathy Vijay: తమిళ స్టార్ విజయ్ పుట్టినరోజు వేడుకల్లో అపశృతి.. వీడియో వైరల్..

Thalapathy Vijay Birthday celebration went wrong goes viral:  సాధారణంగా తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ బర్త్ డేలను ఫ్యాన్స్ తో ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంటారు. కొందరు దీని కోసం పెద్ద బ్యానర్ లు, ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేస్తుంటారు. కొందరైతే.. పాలతో అభిషేకాలు చేస్తుంటారు. బ్యాండ్, బాజాలతో, పెద్ద పెద్ద గజమాలలను సైతం ఏర్పాటు చేసి తమ అభిమానం చాటుకుంటారు. ఇక అభిమాని పుట్టిన రోజున.. ఫ్యాన్స్ కొందరు పేదలకు ఫ్రూట్స్ పంచుతుంటారు. గుళ్లలో హోమాలు, పూజలు  చేస్తుంటారు.

 

బైక్ లు, కార్ల మీద ర్యాలీలు కూడా తీస్తుంటారు.  ఇదంతా మనం రోటీన్ గా చూస్తుంటాం. కానీ కొన్నిసార్లు ఇలాంటి సందర్భాలలో షాకింగ్  ఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. అప్పటి దాక ఫుల్ జోష్ తో ఎంజాయ్ చేసిన పార్టీ అంతా ఒక్కసారిగా విషాదకరంగా కూడా మారిపోతుంది. ఇలాంటి ఘటనలు తరచుగా వార్తలలో ఉంటాయి. తాజాగా, తమిళ స్టార్ హీరో బర్త్ డే సెలబ్రేషన్స్ లలో కూడా అచ్చం ఇలాంటి సంఘటన జరిగింది.

త‌మిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ యాభైవ పుట్టిన‌రోజు వేడుకల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చెన్నైలో విజయ్ అభిమానులు.. ప్రత్యేక కార్యక్రమం చేశారు. అందులో  ఒక బాలుడు కిరోసిన్ తో స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు. అక్కడ టైల్స్ లను పగలగొట్టాడానికి ట్రై చేశాడు. ఇంతలో అనుకోని ఘటన జరిగింది. బాలుడు చేతికి కిరోసిన్ ఉండటం వల్ల మంటలు అంటుకున్నాయి.

విజ‌య్ పుట్టిన‌రోజున‌ నీలాంగరైలో ఓ గ్రూప్ క‌రాటే విన్యాసాలకు ప్రయత్నించింది. వెంటనే బాలుడి చేతికి అంటుకున్న మంటలను కంట్రోల్ చేయడానికి అక్కడి వారు ప్రయత్నించారు. ఈ క్రమంలో.. కాపాడుదామ‌ని వ‌చ్చిన ఒక వ్య‌క్తి చేతిలో పెట్రోల్ బాటిల్ ఉంది. దీంతో స‌డ‌న్‌గా ఆ మంట‌లు కాస్తా స్టేజ్‌పై వ్యాపించాయి.

Read more: Elephant Attacks On Mahout: మావటిని రెండుకాళ్లతో పిండి పిండి చేసిన ఏనుగు.. షాకింగ్ వీడియో వైరల్..

ఇక బాలుడి చేతికి మంటలు ఆర్పబోయిన మరో ఇద్దరికీ కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడి వారు బాలుడిని, మరికొందరికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Kerala newsElephant Attacks on MahoutAngry Elephant

Trending News