Vijay: రజినీకాంత్ సైతం వెనక్కి…విజయ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Vijay Remuneration: విజయ్ పాలిటిక్స్ లోకి ఈ మధ్యనే ఎంట్రీ ఇచ్చి త్వరలో సినిమాలకి శుభం కార్డు పలకనున్నారు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ హీరో రెమ్యూనరేషన్ గురించి హల్ చల్ చేస్తున్న వార్త అందరిని షాక్ కి గురి చేస్తోంది..

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 3, 2024, 08:22 PM IST
Vijay: రజినీకాంత్ సైతం వెనక్కి…విజయ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Thalapathy69:

తమిళంలో సూపర్ స్టార్ ఎవరు అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు రజినీకాంత్. రజినీకాంత్ కి తమిళ ఇండస్ట్రీ వరకే కాదు ఇంటర్నేషనల్ వైడ్ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆయన స్క్రీన్ పైన నడిచొస్తే చాలు ఆ స్టైల్ కే అందరూ ఫిదా అవుతారు. అందుకే ఆయనకి సూపర్ స్టార్ అని బిరుదు వచ్చింది. ఆయన పాపులారిటీ కి తగ్గట్టే ఆయన రెమ్యూనరేషన్ కూడా ఆకాశాన్ని తాకింది. సౌత్ ఇండియాలోనే దాదాపు ఎన్నో రోజులు అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా రజినీకాంత్ పేరు వినపడుతూ వచ్చింది.

ఈ క్రమంలో ఇప్పుడు ఆ సూపర్ స్టార్ ని మించిపోయారు మరో తమిళ హీరో. ఇటీవల సూపర్ హిట్ సాధించిన జైలర్ సినిమాకి రజినీకాంత్ భారీ రెమ్యూనరేషన్ అందుకున్న సంగతి తెలిసిందే. 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన జైలర్ సినిమాకు గాను మన సూపర్ స్టార్ దాదాపు 210 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు వినికిడి.

ఇప్పుడు తమిళ హీరో విజయ్ అంతకన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారట. ఇటీవల విజయ్.. లోకేష్ దర్శకత్వంలో నటించిన ‘లియో’ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నా కానీ 600 కోట్ల పైగా కలెక్షన్స్ ని నమోదు చేసింది. దీంతో విజయ్ కూడా తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేసినట్లు సమాచారం. ఈ క్రమంలో తన చివరి సినిమాగా చెప్పబడుతున్న తన 69వ సినిమాకి విజయ్ ఏకంగా రూ.250 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కానీ నిజమైతే తమిళ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు హీరోలు తీసుకున్న వాటిలో ఇది హైయెస్ట్ రెమ్యూనరేషన్.

 హెచ్ వినోద్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాని స్టూడియో గ్రీన్ అండ్ డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ విజయ్ పాలిటిక్స్ లోకి పూర్తిగా ఎంట్రీ ఇవ్వనుండే దానికి ముందు ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఆడియన్స్ ముందుకు రాబోతుందట. మరి ఈ సినిమాకి విజయ్ తీసుకుంటున్న భారీ రెమ్యూనరేషన్ లో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం విజయ్ 250 కోట్ల పారితోషకం వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Also Read: Deepthi Sunaina: పరువాలతో పిచ్చెక్కిస్తున్న దీప్తి సునైనా, లేటెస్ట్ ఫోటోలు వైరల్

Also Read:  Jasprit Bumrah love story: జస్ప్రీత్ బుమ్రా- సంజనా గణేశన్ లవ్ స్టోరీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitter సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News