Ram Charan: శంకర్, రామ్ చరణ్ సినిమాకు థమన్ మ్యూజిక్

Thaman's music for Ram Charan's next: శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేయనున్న సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు. ఇటీవల వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో సంగీత ప్రపంచంలో మరో సంచలనంగా మారిన థమన్.. తాజాగా శంకర్, రామ్ చరణ్ సినిమాకు సైతం మ్యూజిక్ కంపోజర్‌గా సైన్ చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 19, 2021, 05:40 PM IST
Ram Charan: శంకర్, రామ్ చరణ్ సినిమాకు థమన్ మ్యూజిక్

Thaman's music for Ram Charan's next: శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేయనున్న సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు. ఇటీవల వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో సంగీత ప్రపంచంలో మరో సంచలనంగా మారిన థమన్.. తాజాగా శంకర్, రామ్ చరణ్ సినిమాకు సైతం మ్యూజిక్ కంపోజర్‌గా సైన్ చేశాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తున్న గని, మహేష్ బాబు నటిస్తున్న సర్కార్ వారి పాట (SVP) వంటి చిత్రాలతో పాటు అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాలకు కూడా థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. 

రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన బ్రూస్ లీ చిత్రానికి సంగీతం అందించిన థమన్ మరోసారి చెర్రీ సినిమాకు ట్యూన్స్ కంపోజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక శంకర్‌తో థమన్ అనుబంధం మరింత పాతది అనే చెప్పుకోవచ్చు. శంకర్ డైరెక్ట్ చేసిన బాయ్స్ సినిమాలో హీరో సిద్ధార్థ గ్యాంగులో ఒకరిగా నటించిన థమన్ ఆ తర్వాత శంకర్ నిర్మాతగా వ్యవహరించిన వైశాలి చిత్రంతో సంగీత దర్శకుడిగా  పరిచయమయ్యాడు. అయితే, శంకర్ దర్శకత్వంలో (Director Shankar) సంగీత దర్శకుడిగా చేయడం మాత్రం ఇదే మొదటిసారి. 

దిల్ రాజు (Dil Raju) నిర్మించనున్న ఈ సినిమా రాజకీయాలు నేపథ్యంతో తెరకెక్కనుండగా.. రామ్ చరణ్ (Ram Charan) ఒక స్టూడెంట్ లీడర్ పాత్ర పోషించనున్నాడని తెలుస్తోంది.

Trending News