Sweety Naughty Crazy: హాయిగా నవ్వుకోండి.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘స్వీటీ నాటీ క్రేజీ’

Sweety Naughty Crazy Movie Launched: త్రిగుణ్, శ్రీజిత జంటగా.. రాజశేఖర్.జి దర్శకత్వంలో స్వీటీ నాటీ క్రేజీ మూవీ రూపొందుతోంది. బుధవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.    

Written by - Ashok Krindinti | Last Updated : Aug 7, 2024, 04:50 PM IST
Sweety Naughty Crazy: హాయిగా నవ్వుకోండి.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘స్వీటీ నాటీ క్రేజీ’

Sweety Naughty Crazy Movie Launched: అరుణ్ విజువల్స్ బ్యానర్‌పై రాజశేఖర్.జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ స్వీటీ నాటీ క్రేజీ. త్రిగుణ్, శ్రీజిత ఘోష్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమాను ఆర్.అరుణ్ నిర్మిస్తున్నారు. ఇనియ, రాధ, అలీ, రఘుబాబు, రవి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బుధవారం ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి అలీ క్లాప్ కొట్టారు. దామోదర ప్రసాద్ స్క్రిప్ట్ అందజేయగా.. బెక్కెం వేణు గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. 

Also Read: AP Cabinet: ముగ్గురు పిల్లలున్న వారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ క్యాబినెట్.. డిటెయిల్స్ ఇవే..  

ఈ సందర్భంగా హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో శ్రీజిత, ఇనియల పాత్రలు చక్కగా ఉంటాయని.. టైటిల్‌కు తగ్గట్టుగా స్వీటీ, నాటీ, క్రేజీలా ఉంటాయన్నారు. తనకు ఇంతవరకు కామెడీ చిత్రాలు బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పారు. న‌టుడు రఘుబాబు మాట్లాడుతూ.. త్రిగుణ్ ద్విభాష చిత్రంగా ఈ సినిమాను చేస్తున్నారని చెప్పారు. తెలుగు తాను నటిస్తున్నానని.. తమిళంలో తన పాత్రను రవి మరియ చేస్తున్నారని తెలిపారు. న‌టుడు రవి మరియ మాట్లాడుతూ.. ఈ సినిమాలో తాను ఓ మంచి పాత్రలో నటిస్తున్నానని చెప్పారు. తమిళంలో తాను ఎన్నో చిత్రాల్లో నటించానని.. దర్శకత్వం వహించానని తెలిపారు. ఖుషీ, నాని చిత్రాలకు కో డైరెక్టర్‌గా పని చేశానని అన్నారు.

హీరోయిన్ ఇనియ మాట్లాడుతూ.. తాను బాలనటిగా కెరీర్ మొదలుపెట్టానని.. ఇది తనకు 45వ సినిమా అని చెప్పారు. ఈ మూవీలో తాను నందిని అనే అమ్మాయి పాత్రలో నటిస్తున్నానని తెలిపారు. హీరోయిన్ రాధ మాట్లాడుతూ.. తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పారు. ఇనియతో తాను తమిళంలో చేశానని.. త్రిగుణ్‌తో నటించడం ఆనందంగా ఉందన్నారు. ఇది తనకు రీ ఎంట్రీలా అనిపిస్తోందన్నారు. శ్రీజిత ఘోష్ మాట్లాడుతూ.. తాను ఇలాంటి సినిమాలో నటిస్తుండటం మొదటి సారి అని చెప్పారు. ఓ నటిగా అన్ని రకాల పాత్రలను, సినిమాలను చేయాలని ఈ సినిమాను ఎంచుకున్నట్లు తెలిపారు. 

ఈ సినిమా పూర్తి ఎంటర్టైన్మెంట్ ఓరియెంటెడ్‌గా ఉంటుందని నిర్మాత అరుణ్ తెలిపారు. అందరినీ నవ్వించేలా ఉంటుందన్నారు. దర్శకుడు రాజశేఖర్ మాట్లాడుతూ.. సినిమా పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుందని తెలిపారు. అందరినీ నవ్వించేలా ఉంటుందని చెప్పారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, కామెడీ యాంగిల్‌లో తెరకెక్కిస్తున్నామన్నారు.

నటీనటులు: త్రిగుణ్, శ్రీజిత ఘెష్, ఇనియ, రాధ, అలీ, రఘుబాబు, రవి మరియ తదితరలు

సాంకేతిక బృందం:
==> బ్యానర్: అరుణ్ విజువల్స్
==> నిర్మాత: ఆర్.అరుణ్, 
==> దర్శకుడు: రాజశేఖర్.జి 
==> సినిమాటోగ్రఫీ: సి.విజయశ్రీ
==> ఆర్ట్: జయకుమార్
==> ప్రొడక్షన్ డిజైనర్: ప్రహ్లాదన్
==> ప్రొడక్షన్ మేనేజర్: రవి వర్మ
==> ప్రొజెక్ట్ సూపర్ వైజర్:మోహన్ రాజ్
==> అకౌంట్స్ చీఫ్: బల్వీర్
==> PRO: చంద్ర వట్టికూటి, మోహన్ తుమ్మల.

Also Read: Bithiri Sathi Controversy: వివాదంలో బిత్తిరి సత్తి.. సైబర్ క్రైమ్ లో  కేసు నమోదు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News