Saipallavi: భారీ పౌరాణిక సినిమాలో సీత పాత్రకు ఎంపికైన సాయి పల్లవి

Saipallavi: టాలీవుడ్ నటి సాయి పల్లవి అభిమానులకు గుడ్‌న్యూస్. సినిమాలకు గుడ్ బై చెప్పిందని జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చుతూ కొత్త అప్‌డేట్ వెలువడింది. సినిమాలకు బైబై  కాదు కదా..ఏకంగా బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిందట అమ్మడు. మేటి

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 7, 2022, 10:03 PM IST
Saipallavi: భారీ పౌరాణిక సినిమాలో సీత పాత్రకు ఎంపికైన సాయి పల్లవి

ఫిదాతో అందర్నీ ఫిదా చేసిన టాలీవుడ్ అమ్మడు సాయి పల్లవి ఇటీవలికాలంలో సినిమాలకు దూరంగానే ఉంది. విరాటపర్వం తరువాత సినిమాలకు వీడ్కోలు పలికిందనే వార్తలు ఆమె అభిమానుల్ని నిరాశకు గురి చేసింది. ఇప్పుడు మరో అప్‌డేట్ అదే అభిమానులకు సంతోషం కలగజేస్తోంది.

జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన సాయి పల్లవి..ఫిదా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అద్భుతమైన అభినయం, అందం అన్నింటికీ మించి సూపర్బ్ డ్యాన్స్ ఆమె ప్రత్యేకత. విరాటపర్వం సినిమా తరువాత ఆమె సినిమాలకు బైబై చెప్పిందనే వార్తలొచ్చాయి. తిరిగి డాక్టర్ వృత్తిని కొనసాగించనుందనే వార్తలు ప్రచారమయ్యాయి. ఇది విని ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక సినిమాలు మానేసిందనే ప్రచారం జరిగింది.  ఈ క్రమంలో సాయి పల్లవికి సంబంధించిన మరో న్యూస్ అప్‌డేట్ ఆ అభిమానులకు ఆనందాన్నిస్తోంది. 

సాయి పల్లవి తిరిగి సినిమాల్లో వస్తోందనేది ఆ వార్త. అది కూడా భారీ బాలీవుడ్  సినిమా ఆఫర్ వచ్చిందని సమాచారం. బాలీవుడ్ నిర్మాత రణబీర్ కపూర్ తెరకెక్కిస్తున్న రామాయణం సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్ర పోషిస్తుండగా..సీత పాత్రకు సాయిపల్లవి ఎంపికైందని తెలుస్తోంది. ఇక రావణుడి పాత్రలో హృతిక్ రోషన్ కన్పించనున్నాడు. కొన్ని వందలకోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాలో సాయిపల్లవికి అవకాశం దక్కిందనే వార్త ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా ఇదే రామాయణ ఇతివృత్తంపై ప్రభాస్ రాముడి పాత్రలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రను కృతిసనన్ పోషిస్తోంది. ఈ రెండు సినిమాల్లో సీత పాత్రకు ఎవరు న్యాయం చేస్తారో చూడాలి.

Also read: Baba Re Release: 'బాబా' మరింత ముందుకు.. బర్త్ డే రోజున కాకుండా ముందే ఎందుకో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News