Krack Hindi Remake: హిందీలో రీమేక్ కానున్న టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ క్రాక్, హీరో ఎవరు మరి

Krack Hindi Remake: సంక్రాంతి విడుదల సినిమాల్లో అగ్రస్థానంలో నిలిచింది మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమా. రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన ఈ మూవీని హిందీలో రీమేక్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయి..మరి హీరో ఎవరు హిందీ రీమేక్‌లో..

Last Updated : Jan 26, 2021, 10:20 PM IST
  • క్రాక్ మూవీ బంపర్ హిట్ కొట్టడంతో హిందీలో రీమేక్ కోసం బాలీవుడ్ ప్రయత్నాలు
  • రవితేజ పాత్రలో సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, షాహిద్ కపూర్ పేర్లు పరిశీలన
  • జెర్సీ హిందీ రీమేక్‌లో బిజీగా ఉన్న షాహిద్ కపూర్
Krack Hindi Remake: హిందీలో రీమేక్ కానున్న టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ క్రాక్, హీరో ఎవరు మరి

Krack Hindi Remake: సంక్రాంతి విడుదల సినిమాల్లో అగ్రస్థానంలో నిలిచింది మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమా. రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన ఈ మూవీని హిందీలో రీమేక్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయి..మరి హీరో ఎవరు హిందీ రీమేక్‌లో..

కరోనా సంక్షోభం ( Corona Crisis ) అనంతరం థియేటర్లలో విడుదలై సంక్రాంతి హిట్ ( Sankaranti Hit ) ‌గా నిలిచిన సినిమా క్రాక్ ( Krack ). మాస్ మహారాజా రవితేజ ( Raviteja ) ఈ సినిమాపై పెట్టుకున్న ఆశలు నిజమయ్యాయి. అతని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రెండు వారాల్లోనే 35 కోట్లు వసూలు చేసి రికార్డు సాధించింది. సంక్రాంతికి విడుదలై హిట్ అయిన సినిమాల్లో క్రాక్ అగ్రస్థానంలో ఉంది. అందుకే ఇప్పుడు ఈ సినిమాపై హిందీ చలన చిత్ర పరిశ్రమ బాలీవుడ్ ( Bollywood ) దృష్టి సారించింది. హిందీలో రీమేక్  ( Krack Hindi Remake ) చేసేందుకు సన్నాహాలు చేస్తోంది బాలీవుడ్.

టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ( Gopichand Malineni ) కి రీమేక్ విషయమై బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. అయితే రవితేజ పాత్ర ( Who will play hero role in hindi remake ) ను హిందీలో ఎవరు పోషిస్తారనేది ఆసక్తి కల్గిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్ ( Salman khan ), అజయ్ దేవ్‌గణ్ ( Ajay Devgan ), షాహిద్ కపూర్ ( Shahid kapoor ) పేర్లు విన్పిస్తున్నాయి. అర్జున్ రెడ్డి చిత్రం రీమేక్ ( Arjun reddy remake ) ‌గా వచ్చిన కబీర్ సింగ్‌ ( Kabir singh ) తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న షాహిద్ కపూర్ ప్రస్తుతం మరో తెలుగు సినిమా జెర్సీ హిందీ రీమేక్ ( Jersi Hindi remake ) ‌లో బిజీగా ఉన్నాడు. వేసవి సెలవుల్లో విడుదల కానుంది ఈ సినిమా. షాహిద్ కపూర్ బిజిగా ఉన్నాడు కాబట్టి సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్‌లలో ఒకరు క్రాక్ హిందీ రీమేక్‌లో నటిస్తారనే టాక్ నడుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Also read: Movies to be release: ఒకేరోజు నాలుగు సినిమాలు విడుదల, ఆ రోజు ప్రత్యేకత ఏంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News