Shakeela about Tollywood casting couch: ‘మీ టూ’ మూమెంట్ తర్వాత.. ఇప్పుడు మళ్ళీ అన్ని ఇండస్ట్రీల నుండి లైంగిక దాడుల గురించి కంప్లెయింట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హేమ కమిటీ నివేదిక విడుదలైన తర్వాత,మలయాళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖుల చేతిలో లైంగిక వేధింపులకు గురైన చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న చెడు అనుభవాలను కూడా బయటపెడుతున్నారు.
ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ వారు, పలు హీరోయిన్లు కూడా ఇంకా మహిళలు ముందుకు వచ్చి మాట్లాడాలని అలాగే నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలపై లైంగిక వేధింపుల కేసులో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. తమిళ సినీ ఇండస్ట్రీ నుండి కూడా ఇలాంటి పలు ఆరోపణలు వెలువడ్డాయి.
నటి శకీల, కుట్టి పద్మినీ వంటి వారు ఇప్పుడు దీని గురించి నోరు విప్పారు. ఈ నేపథ్యంలో నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ కూడా ఇలాంటి సంఘటనలపై దర్యాప్తు చేపట్టడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
ఒక ఇంటర్వ్యూలో సీనియర్ టెలివిజన్ నటి కుట్టి పద్మినీ మాట్లాడుతూ, “టీవీ సీరియల్స్‌లో దర్శకులు, టెక్నీషియన్లు లేడీ ఆర్టిస్టుల మీద లైంగిక దాడి చేస్తారు. కానీ ఆ వేధింపులు నిరూపించలేమని చాలా మంది ఫిర్యాదు కూడా చేయరు. కొంతమంది మహిళలు మాత్రం డబ్బుల కోసం వారికి సహకరిస్తారు.” అని అన్నారు. ఆమె కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను అని.. ఆ సమయంలో తన తల్లి వారికి ఎదురు తిరగడంతో వాళ్లు ఆమెని సినిమా నుంచి తొలగించారు అని చెప్పుకొచ్చారు.
ఒక తమిళ్ ఇంటర్వ్యూలో నటి శకీల మాట్లాడుతూ, లైంగిక వేధింపులు తమరు ఇండస్ట్రీలో ఉన్న మాట నిజమే కానీ.. తెలుగు ఇండస్ట్రీలో ఇంకా ఎక్కువగా ఉన్నాయి అని అన్నారు. అయితే వీటిని పెద్ద సమస్యలుగా పరిగణలోకి తీసుకోవడం లేదు అని.. కానీ అలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.