Lavanya Tripathi : జార్జ్‌ ఎవరెస్ట్‌పై లావణ్య త్రిపాఠి..

Lavanya Tripathi on George Everest: పర్వాతారోహణలో లావణ్య ముందుంది. తాజాగా ఉత్తరాఖండ్‌లోని 8,848 మీటర్ల ఎత్తున్న జార్జ్ ఎవరెస్ట్‌ శిఖరాన్ని లావణ్య అధిరోహించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2021, 07:49 PM IST
  • లావణ్య త్రిపాఠిలో యాక్టింగ్‌తో పాటు చాలా స్కిల్స్
  • పర్వాతారోహణలో ముందంజలో ఉన్న లావణ్య
  • జార్జ్ ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన లావణ్య
Lavanya Tripathi : జార్జ్‌ ఎవరెస్ట్‌పై లావణ్య త్రిపాఠి..

Tollywood heroine Lavanya Tripathi on George Everest: హీరోయిన్‌ లావణ్య త్రిపాఠిలో (Lavanya Tripathi) యాక్టింగ్‌తో పాటు చాలా స్కిల్స్ ఉన్నాయి. పర్వాతారోహణలో లావణ్య ముందుంది. తాజాగా ఉత్తరాఖండ్‌లోని 8,848 మీటర్ల ఎత్తున్న జార్జ్ ఎవరెస్ట్‌ (George Everest) శిఖరాన్ని లావణ్య అధిరోహించింది. అందుకు సంబంధించిన వీడియోను లావణ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. లావణ్య (Lavanya) మాదిరిగానే ఇటీవలి కాలంలో చాలామంది మహిళా ప్రముఖులు అడ్వెంచర్లు చేస్తున్నారు. పురుషులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సాహసాలు చేస్తున్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lavanya T (@itsmelavanya)

 

Also Read : Sarkaru Vaari Paata Movie Shooting: స్పెయిన్ లో మహేష్ మానియా.. వీడియో వైరల్

2012లో లావణ్య తెలుగు సినీ పరిశ్రమకు (Tollywood) పరిచయం అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 16కు పైగా సినిమాల్లో నటించింది. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన లావణ్య (Lavanya) తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

Also Read : Unstoppable Promo:'వన్స్ ఐ స్టెప్ ఇన్..దెబ్బకు థింకింగ్ మారిపోవాలా'..అంటున్న బాలయ్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News