Tollywood Heroines: హీరోలేనా.. హీరోయిన్లకు మనస్తత్వం లేదా.. కోట్లల్లో పారితోషకం.. కానీ..?

Actors Donations for AP and Telangana Floods: రెండు తెలుగు రాష్ట్రాలలో వరద ఉధృతి కారణంగా కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజలు తిండి లేక అలమటిస్తుంటే , చాలామంది స్వచ్ఛంద సంస్థల ద్వారా రెండు రాష్ట్రాల సహాయనిధికి విరాళాలు అందిస్తున్నారు.  కానీ ఒక్క హీరోయిన్ కూడా విరాళం ప్రకటించకపోవడంతో నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 4, 2024, 11:04 PM IST
Tollywood Heroines: హీరోలేనా.. హీరోయిన్లకు మనస్తత్వం లేదా.. కోట్లల్లో పారితోషకం.. కానీ..?

Tollywood Actors Donations for AP and Telangana Floods: వరద ఉధృతి కారణంగా గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలు, వరదలతో చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. బాధితులకు సహాయం చేయడానికి ప్రభుత్వాలతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, ఆఖరికి హీరోలు కూడా తమ వంతు సహాయంగా, స్వచ్ఛందంగా తరలివచ్చి సహాయం చేస్తున్నారు.  డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం, నీళ్లు, పాలుz బిస్కెట్లు వంటివి పంపిణీ చేస్తున్నారు. ఇటువంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, మహేష్ బాబు, బాలకృష్ణ, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ వంటి స్టార్ హీరోలతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగవంశీ,  వెంకీ అట్లూరి వంటి డైరెక్టర్లే కాకుండా చినబాబు, అశ్విని దత్ లాంటి నిర్మాతలు కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోట్లల్లో విరాళాలు ప్రకటిస్తూ తమ మంచి మనసు చాటుకుంటున్నారు. 

ఇకపోతే ఇదంతా బాగానే ఉన్నా తెలుగులో స్టార్ హీరోయిన్స్ గా చలామణి అవుతున్న హీరోయిన్లు.. ఒక్కరు కూడా ఈ విషయంపై స్పందించడం లేదు.. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను  సొంతం చేసుకున్న ఎంతోమంది హీరోయిన్స్.. పరాయి భాషకు చెందిన వారైనా.. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తేనే ఆ స్టేటస్ అందుకున్నారు. అలాంటిది తెలుగు ప్రేక్షకులు,  ప్రజలు  ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు స్పందించడం లేదు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.  

ముఖ్యంగా సమంత, నయనతార ,అనుష్క,  రష్మిక, త్రిష, , శ్రీ లీల, కాజల్, తమన్నా,  కీర్తి సురేష్ , నిధి అగర్వాల్, మృణాల్ ఠాగూర్ ఇలా చాలామంది హీరోయిన్లు తెలుగు సినిమాల ద్వారా కోట్ల రూపాయల పారితోషకాన్ని మూట కట్టుకున్నారు. అందులో నుంచి కనీసం రూ.10 లక్షలు కూడా దానం చేయలేని దుస్థితిలో ఉన్నారా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కోట్లల్లో పారితోషకం తీసుకుంటూ భారీగా ఆస్తులు వెనకేసుకుంటున్న ఈ హీరోయిన్లకు,  అసలు మనస్తత్వం లేదా..? వరద బాధితులు ఆర్తనాదాలు వారికి వినపడడం లేదా... ? నీట మునిగిన ఇళ్లల్లో కరెంటు లేక, ఉండడానికి చోటు లేక,  బిక్కుబిక్కుమంటున్న చిన్నారుల బాధలు వీరికి వినిపించడం లేదా ? అంటూ మిగతా ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  కనీసం ఇప్పటికైనా హీరోయిన్లు స్పందించి విరాళాలు ప్రకటించాలని కోరుతున్నారు. మరి ఈ హీరోయిన్లకు అసలు మనస్తత్వం ఉందో లేదో అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

Also Read: Harish Rao: వరద బాధితుల కన్నీళ్లు తుడిచిన హరీశ్ రావు.. రేవంత్‌ ప్రభుత్వంపై శాపనార్థాలు

Also Read: Telangana Floods: విరాళంపై రగడ.. వైజయంతి మూవీస్‌కు తెలంగాణ విద్యార్థుల వార్నింగ్‌

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News