Bahishkarana: నాగార్జున చేతులు మీదుగా అంజలి ‘బహిష్కరణ’ ట్రైలర్ విడుదల.. ఆ రోజు నుంచి జీ5 లో స్ట్రీమింగ్..

Bahishkarana Trailer Talk: అంజలి ప్రధాన పాత్రలో జీ5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్ పై తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో కింగ్ నాగార్జున విడుదల చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 11, 2024, 07:51 AM IST
Bahishkarana: నాగార్జున చేతులు మీదుగా అంజలి ‘బహిష్కరణ’ ట్రైలర్ విడుదల.. ఆ రోజు నుంచి జీ5 లో స్ట్రీమింగ్..

Bahishkarana Trailer Talk: తెలుగు, తమిళం సహా వివిధ భాషల్లో 50 పైగా చిత్రాల్లో విలక్షణ పాత్రల్లో మెప్పించిన కథానాయిక అంజలి. ఈమె లీడ్ రోల్లో యాక్ట్ చేసిన వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’.ఈ  సిరీస్ ను ముఖేష్ ప్రజాపతి డైరెక్ట్ చేసారు. గ్రామీణ కక్షల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్ గా రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కు రానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను నాగార్జున విడుదల చేసారు.

ట్రైలర్ విషయానికొస్తే.. మంచోడు చేసే త‌ప్పేంటో తెలుసా.. చెడ్డోడి చ‌రిత్ర గురించి తెలుసుకోవ‌టం అనే డైలాగ్‌తో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.  ఓ వైపు ప‌చ్చ‌టి ప‌ల్లెటూరు, అక్క‌డ అంజ‌లి, శ్రీతేజ్‌, అన‌న్య నాగ‌ళ్ల పాత్రల మ‌ధ్య సీన్స్ గ్లామరస్ గా చూపిస్తూనే.. అదే ఊర్లో పెద్ద మనిసి, అతని మనుషులు చేసే అరాచకాలను చూపించారు. అలాంటి కక్షలు కార్యపణ్యాలతో రగిలిపోయే ప‌ల్లెటూర్లోకి పుష్ప అనే యువతి వ‌స్తుంది. ఆమె వ‌చ్చిన త‌ర్వాత అక్క‌డి పరిస్థితులు ఎలా మారాయి.  ఇంత‌కీ పుష్ప  ఆ ఊరుకు ఎందుకు వచ్చింది.  ఊరి పెద్ద‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? అమ్మాయిల‌ను ఆట‌ వ‌స్తువులుగా చూసింది ఎవ‌రు? ఇలాంటి ఎన్నెన్నో ప్ర‌శ్న‌ల‌కు ఆన్సర్ తెలియాలంటే బ‌హిష్క‌ర‌ణ వెబ్ సీరీస్‌ చూడాల్సిందే.

అంజ‌లి పాత్ర‌ను విషయానికొస్తే.. ఓ వైపు ప్రేమ కురిపిస్తూనే మ‌రో వైపు ఆగ్ర‌హావేశంతో ఊగిపోయేలో ఆమె పాత్రను డిజైన్ చేసారు.  మొత్తంగా తన పాత్రలో భావోద్వేగాలను ఎంతో చక్కగా అభినయించింది. శ్రీతేజ్‌, అన‌న్య నాగ‌ళ్ల పాత్ర‌ల‌తో పాటు ఊరి పెద్ద పాత్ర‌లో ర‌వీంద్ర‌న్ విజ‌య్‌ను నటించారు. ప్ర‌శాంతంగా ఉండే ఆ ప‌ల్లెటూరుకి పుష్ప అనే అమ్మాయి ఎందుకు వ‌చ్చింది.. ఆమెకు అక్క‌డ ఎదురైన ప‌రిస్థితులేంటి? ఆమె ఎవ‌రిపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకొని ఆ ఊరుకు వచ్చిందనేది సస్పెన్స్. మొత్తంగా ఈ ప్రశ్నీలకు సమాధానం తెలియాలంటే జూలై 19న ZEE 5లో స్ట్రీమింగ్ కానున్న‌ ‘బహిష్కరణ’ సిరీస్ చూడాల్సిందే.

ట్రైల‌ర్‌లో చూపించిన ప్ర‌తి విజువ‌ల్‌ బాగుంది. కెమెరా పనితనం ఉట్టిపడుతుంది.  ప్ర‌తి మాటా సీరీస్ గురించి లోతుగా ఏదో చెప్పే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంది. ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా  ట్రైల‌ర్‌ ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంది. జూలై 19 ఎప్పుడెప్పుడు వ‌స్తుందా?  సీరీస్‌ని ఎంత త్వ‌ర‌గా చూద్దామా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సిరీస్‌కు ప్రసన్నకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. సిద్ధార్థ్ సదాశివుని సంగీతాన్ని సమకూర్చారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌గా పనిచేైసారు. భార‌త‌ దేశంలో అతి పెద్ద ఓటీటీ మాధ్య‌మం ZEE 5. ప‌లు భాష‌ల్లో వైవిధ్య‌మైన సినిమాలు, సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు అప‌రిమిత‌మైన ఎంటర్టైన్మెంట్  అందిస్తోంది. ఇదే క్ర‌మంలో ‘బహిష్కరణ’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియెన్స్‌ను త్వరలోనే అలరించనుంది.

 ZEE5 గురించి...

జీ5 భార‌త‌దేశ‌పు అసలసిసలైన ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. వివిధ భాషలకు చెందిన కథలకు ఇది ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. ఇందులో దాదాపు 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉంది.  1,750 టీవీ షోలు.. 700 ఒరిజిన‌ల్స్ వెబ్ సిరీస్లు.. 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ జీ5 సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌,  కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌,టీవీ షోస్‌, మ్యూజిక్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ఆడియన్స్ ను అలరిస్తోంది.  మొత్తంగా జీ5 అనేది అసలు సిసలు భారతీయ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కంటెంట్ అందించడంలో ముందుంది. ఈ సిరీస్ లో అంజలితో పాటు అనన్య నాగళ్ల, శ్రీతేజ్, రవీంద్ర విజయ్, షణ్ముఖ్, చైతన్య సాగిరాజు, మహ్మద్ బాషా, బేబి చైత్ర తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.

Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..

Read more:Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News