Samantha and Vijay Accident: కారుతో సహా నదిలో పడిపోయిన సమంత, విజయ్ దేవరకొండ, తీవ్ర గాయాలు ?

Samantha and Vijay: టాలీవుడ్ క్రేజీ నటులు విజయ్ దేవరకొండ, సమంతలు ప్రమాదానికి గురయ్యారు. సినిమా షూటింగ్‌లో జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరికీ గాయలవడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 24, 2022, 09:23 AM IST
Samantha and Vijay Accident: కారుతో సహా నదిలో పడిపోయిన సమంత, విజయ్ దేవరకొండ, తీవ్ర గాయాలు ?

Samantha and Vijay Accident: టాలీవుడ్ క్రేజీ నటులు విజయ్ దేవరకొండ, సమంతలు ప్రమాదానికి గురయ్యారని వార్తలు వస్తున్నాయి. సినిమా షూటింగ్‌లో జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరికీ గాయలవడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. 

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అగ్ర నటి సమంత కారు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరూ కలిసి నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఓ యాక్షన్ సన్నివేశం నిమిత్తం కారు డ్రైవ్ చేస్తుండగా..అత్యంత ప్రమాదకరమైన సీన్ షూట్ జరిగింది. నదికి రెండువైపులా కట్టిన తాడుపై కారు నడపాల్సిన పరిస్థితి. దురదృష్టవశాత్తూ ఆ వాహనం పట్టు తప్పి కారులో పడిపోయింది. సమంత, విజయ్ దేవరకొండ ఇద్దరికీ స్పైనల్ కార్ట్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఖండించిన సినిమా యూనిట్

అయితే ఈ వార్తల్ని ఖుషి సినిమా యూనిట్ ఖండించింది. ఖుషి సినిమా షూటింగ్‌లో విజయ్ దేవరకొండ, సమంతలకు గాయాలు అయినట్టు కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు వస్తున్నాయని..అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. టీం అంతా సక్సెస్‌ఫుల్‌గా కాశ్మీర్‌లో 30 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకొని నిన్ననే హైదరాబాద్ తిరిగి వచ్చారని వెల్లడించింది. రెండో షెడ్యూల్ అతి త్వరలోనే మొదలు కానుంది.దయచేసి ఎలాంటి పుకార్లు నమ్మవద్దని స్పష్టం చేసింది.

ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరినీ దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శివ నిరవణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఇటీవలే విడుదలైంది. కశ్మీర్‌లోని అందమైన లొకేషన్లలో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. డిసెంబర్ 23న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మళయాల భాషల్లో విడుదల కానుంది. 

Also read: Cheating Case on RGV: రాంగోపాల్ వర్మపై చీటింగ్ కేసు... రూ.56 లక్షలు తీసుకుని మోసం...?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News