Mahesh Babu: అల్లు అర్జున్ పుష్పపై మహేశ్ బాబు రివ్యూ ఎలా ఉందో తెలుసా

Mahesh Babu: టాలీవుడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప రికార్డులు సృష్టిస్తోంది. ఉత్తరాదిన మెగా మెగా హిట్‌గా నిలుస్తున్న  ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేశ్‌బాబు తనదైన శైలిలో సమీక్ష చేశాడు. ట్విట్టర్ వేదికగా మహేశ్‌బాబు చేసిన ఆ సమీక్షను మనమూ చూసేద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 5, 2022, 09:15 AM IST
Mahesh Babu: అల్లు అర్జున్ పుష్పపై మహేశ్ బాబు రివ్యూ ఎలా ఉందో తెలుసా

Mahesh Babu: టాలీవుడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప రికార్డులు సృష్టిస్తోంది. ఉత్తరాదిన మెగా మెగా హిట్‌గా నిలుస్తున్న  ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేశ్‌బాబు తనదైన శైలిలో సమీక్ష చేశాడు. ట్విట్టర్ వేదికగా మహేశ్‌బాబు చేసిన ఆ సమీక్షను మనమూ చూసేద్దాం.

టాలీవుడ్ స్టైలిష్‌స్టార్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన మరో చిత్రం పాన్ ఇండియా మూవీ పుష్ప (Pushpa Movie) దుమ్ము రేపుతోంది. డిసెంబర్ 17, 2021లో విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్ ఊహించనిరీతిలో సక్సెస్ అయింది. మెగా హిట్ దిశగా దూసుకుపోతూ..పెద్దఎత్తున కలెక్షన్లు చేస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపధ్యంలో సాగిన సినిమాలో బన్నీ..పుష్పరాజ్‌గా, రష్మిక..శ్రీవల్లిగా నటించారు.

ఇప్పుడీ సినిమాపై సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) ట్విట్టర్ వేదికగా రివ్యూ ఇచ్చేశాడు. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ (Allu Arjun)నటన సన్నింగ్‌గా..సహజంగా, సెన్సేషనల్‌గా ఉందని కీర్తించాడు. తన సినిమాలు ఎంత వాస్తవంగా, పచ్చిగా, నిజాయితీగా ఉంటాయనేది సుకుమార్ మరోసారి నిరూపించాడని మహేశ్ ట్వీట్ చేశాడు.

ఆ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లపై కూడా ప్రశంసలు కురిపించాడు. ఇక దేవీశ్రీప్రసాద్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. దేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని..రాక్‌స్టార్ అని కీర్తించాడు. సినిమా సక్సెస్ అయినందుకు మైత్రీ మూవీ మేకర్స్‌కు శుభాకంక్షలు అందించాడు మహేశ్ బాబు.

Also read: Hansika: టాలీవుడ్ అమూల్ బేబీ హన్సిక చేతిలో వరుస సినిమాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News