Kajol Re-entry: త్వరలోనే సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వనున్న కాజోల్ ?

Kajol Re-entry: టాలీవుడ్ అగ్రనటి కాజోల్ మరోసారి పరిశ్రమకు రీఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. పెళ్లవడం, పండంటి బిడ్డకు జన్మనివ్వడం తరువాతి పరిణామాల్లో కాస్సేపు బ్రేక్ ఇచ్చింది కాజోల్. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 7, 2022, 07:59 PM IST
 Kajol Re-entry: త్వరలోనే సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వనున్న కాజోల్ ?

Kajol Re-entry: టాలీవుడ్ అగ్రనటి కాజోల్ మరోసారి పరిశ్రమకు రీఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. పెళ్లవడం, పండంటి బిడ్డకు జన్మనివ్వడం తరువాతి పరిణామాల్లో కాస్సేపు బ్రేక్ ఇచ్చింది కాజోల్. 

తెలుగు సినీ పరిశ్రమలో కాజోల్ పేరు తెలియనివారెవరూ ఉండరు. చక్కని అభినయం, చూడచక్కని అందంతో తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనటిగా పేరొందింది. వరుస సినిమా ఆఫర్లతో బిజీగా మారిన కాజోల్ పెళ్లితో ఒక్కసారిగా బ్రేక్ ఇచ్చింది. తెలుగు సినిమాకు దూరమైంది. పెళ్లి తరువాత గర్భం దాల్చడంతో ఇంకాస్త గ్యాప్ పెరిగింది. ఆ తరువాత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఓ దశలో కాజోల్ సినిమాలకు గుడ్‌బై చెప్పిందంటూ వార్తలు కూడా వచ్చాయి.

ఇప్పుడు కాజోల్ అభిమానులకు ఓ గుడ్‌న్యూస్ అందింది. కాజోల్ తిరిగి రీఎంట్రీ ఇస్తోందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రెగ్నెన్సీ సమయంలో బొద్దుగా మారిన కాజోల్..ఇప్పుడు నాజూగ్గా మారడమే దీనికి కారణం. కాజోల్ నాజూగ్గా, అందంగా కన్పిస్తోంది ఈ పోటోల్లో. సినిమాల్లో రీఎంట్రీ కోసమే ఫిజిక్‌పై దృష్టి సారించిందని తెలుస్తోంది. సాధ్యమైనంతవరకూ బరువు తగ్గించుకుని..మళ్లీ సినిమాలు చేయాలనేదే కాజోల్ ఆలోచనగా తెలుస్తోంది. సరైన కథ కోసం ఇప్పట్నించే ఎదురుచూస్తోందని సమాచారం.

Also read: This Week Releases: 12 సినిమాలు, 10 వెబ్‌సిరీస్‌లు.. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో సందడి చేయబోయే చిత్రాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News