Top webseries: ఈ మధ్య కాలంలో నెటిజన్లను ఆకట్టుకున్న వెబ్‌సిరీస్‌లివే..!

ఓటీటీలు వచ్చాక వీక్షకులకు వెబ్ సిరీస్ లపై మనసు మళ్లింది. కంటెంట్ బాగుంటే చాలు ..యాక్షన్‌, డ్రామా, క్రైమ్‌ ఇలా అన్ని  రకాల వెబ్ సిరీస్ లను చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో పాపులర్ అయిన వెబ్ సిరీస్ లేంటో చూద్దాం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2021, 12:39 PM IST
Top webseries: ఈ మధ్య కాలంలో నెటిజన్లను ఆకట్టుకున్న వెబ్‌సిరీస్‌లివే..!

Top webseries: ఓటీటీ(OTT)లు వచ్చాక కావాల్సినంత వినోదం దొరుకుంది. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, ఆహా, డిస్నీ హాట్‌స్టార్‌ ఇలా ఓటీటీ వేదికలెన్నో ప్రేక్షకుడిని కట్టిపడేస్తున్నాయి. సూపర్‌హిట్‌ చిత్రాలను మించిన కంటెంట్‌తో వినోదాల విందును అందిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్న వెబ్‌సిరీస్‌లేంటో ఓ లుక్కేద్దాం.

స్క్విడ్‌ గేమ్‌
వరల్డ్ వైడ్ గా ట్రెండ్‌ అవుతున్న నంబర్‌ వన్‌ నెట్‌ఫ్లిక్స్‌(Netflix) సిరీస్‌ ‘స్క్విడ్‌గేమ్(Squid Game)’‌. అప్పుల పాలైన వారికి వందలకోట్ల ప్రైజ్‌మనీ ఎరచూపి ఒక రహస్య దీవిలో ఆటల పోటీలు నిర్వహిస్తారు. 456 మంది పాల్గొనే ఈ ఆటలో ఒక్కరే విజేతగా నిలుస్తారు. మిగతా వారంతా ఓడిపోయి ప్రాణాలు కోల్పోతారు. ప్రతి ఎపిసోడ్‌ ఆద్యంతం అలరిస్తుంది.

Also Read: Miles of love Trailer: బాయ్స్ లవ్‌లో చాలా వీక్ అంటున్న మైల్స్ ఆఫ్ లవ్ ట్రైలర్

కార్టెల్‌
గ్యాంగ్‌వార్‌ సినిమాలని ఇష్టపడేవారికి మంచి వినోదాన్ని అందించే వెబ్‌సిరీస్‌ ‘కార్టెల్‌(Cartel)’.  ఐదుగురు గ్యాంగ్‌స్టర్లు(Gangstars) ముంబయిని పంచుకొని అండర్‌వరల్డ్‌ మాఫియాను నడుపుతుంటారు. వీళ్లందరిని నియంత్రిస్తూ రాణిమాయి ఆ మహానగరాన్ని శాసిస్తుంటుంది. ఎప్పుడైతే ఆమె అనారోగ్యం పాలై మంచాన పడిందో, అప్పటి నుంచి ముంబయి మీద పట్టు కోసం అయిదుగురి మధ్య గ్యాంగ్‌వార్‌ మొదలవుతుంది. ఈ అంతర్గతం యుద్ధం ఎటు దారితీసిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. యాక్షన్‌ ప్రియులకు పండగలాంటి వెబ్‌సిరీస్‌ ఇది. ఆల్ట్‌ బాలాజీ, ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌(MX Player)లలో ప్రసారం అవుతోంది.

గ్రహణ్‌
దేశరాజధాని దిల్లీలో జరిగిన 1984 అల్లర్ల నేపథ్యంలో తెరకెక్కిన ఎమోషనల్‌ క్రైమ్ డ్రామా ‘గ్రహణ్‌(Grahan)’. ఆనాటి భయానక పరిస్థితిని కళ్లకు కట్టడమే కాదు, ఆ హింస వల్ల కోల్పోయిన జీవితాలు, సామాన్యులు పడిన వేదనను అద్భుతంగా చూపించారు. పవన్‌ మల్హోత్ర, జోయా హుస్సేన్‌ ప్రధాన పాత్రల్లో జీవించారనే చెప్పాలి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నటన ఎందులోనూ తగ్గలేదీ సిరీస్‌. గుండెలను తాకే ఈ వెబ్‌సిరీస్‌ డిస్నీ హాట్‌స్టార్‌(Disney hotstar)లో స్ట్రీమ్‌ అవుతోంది. 

కోటా ఫ్యాక్టరీ2
ఐఐటీ, మెడిసిన్‌ ప్రవేశ పరీక్షల శిక్షణకి రాజస్థాన్‌లోని కోటా నగరానికి ఏటా లక్షల్లో విద్యార్థులు వస్తారు. ఒకరకంగా ప్రవేశ పరీక్షల కర్మాగారమని పిలవొచ్చు. అంతలా ప్రసిద్ధి చెందిందిది. ఇంటిని, కుటుంబాన్ని, స్నేహితులని వదిలి ఐఐటీ కలను నెరవేర్చుకోడానికి ఒంటరిగా వచ్చిన కుర్రాడి కథే ‘కోటా ఫ్యాక్టరీ(Kota Factory)’. ఇది నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమ్ అవుతోంది.  

Also Read:Salman Antim Trailer: సల్మాన్ ‘'అంతిమ్‌’' ట్రైలర్‌ అదిరిపోయిందిగా...!

ఫ్యామిలీమ్యాన్‌2
మనోజ్‌ బాజ్‌పాయి, ప్రియమణి నటించిన ‘ఫ్యామిలీమ్యాన్‌(Family Man)’ మొదటి సీజన్‌ ఘనవిజయం సాధించింది. రెండో సీజన్ కొద్ది నెలల క్రితమే అమెజాన్‌ ప్రైమ్‌(Amazon prime)లో విడుదలైంది. సమంత ప్రతినాయిక పాత్రలో అలరించింది. సీక్రెట్‌ ఏజెంట్‌ అయిన శ్రీకాంత్ ఉగ్రదాడి నుంచి దేశాన్ని ఎలా కాపాడాడనే కథాంశంతో తెరకెక్కింది. సమంత పాత్రపై కొంత విమర్శలు వచ్చినప్పటికీ, వెబ్‌సిరీస్‌ మాత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 

హౌస్‌ ఆఫ్‌ సీక్రెట్స్‌: ది బురారీ డెత్స్‌
దిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే ఇంట్లో 11 మంది ఆత్మహత్య చేసుకున్న ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. 2018లో జరిగిన ఈ ఘటన వెనకున్న అసలు నిజాన్ని డాక్యుమెంటరీ(Documentry) సిరీస్‌గా తెరకెక్కించారు. మొత్తం మూడు ఎపిసోడ్లున్న ఈ సిరీస్‌ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. ఒక డాక్యుమెంటరీని ఇంత థ్రిల్లింగ్‌గా తెరకెక్కించడం ఇది వరకు చూసి ఉండరు. 

మనీ హైస్ట్: పార్ట్‌ 5
‘మనీహైస్ట్‌’ నెట్‌ఫ్లిక్స్‌లో ఓ సంచలనం. అరంగేట్ర వెబ్‌సిరీస్‌గా రికార్డులు సృష్టించిన ‘మనీహైస్ట్‌’(Money Heist) ఐదో సీజన్‌ ఈ మధ్యే విడుదలై అమితంగా ఆకట్టుకుంటుంది. బ్యాంక్‌ దోపిడి నేపథ్యంలో థ్రిల్లింగ్ ఉండే వెబ్‌సిరీస్‌ ఇది. తెలుగు వెర్షన్‌ కూడా విడుదలైంది. 

కుడి ఎడమైతే
కాలం చుట్టూ తిరిగే కథలు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. ఈ కాన్సెప్ట్‌ను ఉపయోగించుకుని ఆసక్తికరంగా తెరకెక్కిన వెబ్‌సిరీస్‌ ‘కుడి ఎడమైతే(Kudi Yedamaithe)’. ‘యూటర్న్‌’లాంటి విభిన్న కథను ప్రేక్షకులకు అందించిన పవన్‌కుమార్‌ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఇటీవల ఆహా(Aha)లో విడుదలైన ఈ వెబ్‌సిరీస్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. గ్లామర్‌ డాల్‌ అమలాపాల్‌(amalapal) ప్రధానపాత్రలో నటించిన ఈ వెబ్‌సిరీస్‌ వీక్షకులను ఆకట్టుకుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News