Jr NTR: మళ్లీ కలవబోతున్న త్రివిక్రమ్..జూనియర్ ఎన్టీఆర్.. ఈసారి ఎందుకోసమంటే!

Trivikram: జూనియర్ ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన.. అరవింద సమేత సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో వీరిద్దరూ మరోసారి కలిసి కనిపించబోతున్నారు అనే వార్త వైరల్ అవుతోంది..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 7, 2024, 02:19 PM IST
Jr NTR: మళ్లీ కలవబోతున్న త్రివిక్రమ్..జూనియర్ ఎన్టీఆర్.. ఈసారి ఎందుకోసమంటే!

Trivikram -Jr NTR: త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన చిత్రం అరవింద సమేత. ఈ సినిమా 2018లో విడుదలై మంచి విజయం సాధించింది. మామూలుగా త్రివిక్రమ్ తన సినిమాలలో హీరోలను రిపీట్ చేస్తూ ఉంటారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తో రెండు మూడు చిత్రాల పైగానే చేశారు ఈ డైరెక్టర్. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో మంచి విజయం సాధించిన ఆ తరువాత మాత్రం మరో సినిమా ఇప్పటివరకు చేయలేదు.

దీంతో నందమూరి అభిమానులు మళ్లీ ఎప్పుడు ఎప్పుడు త్రివిక్రమ్ తో జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి వీరిద్దరూ కలవబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వీరు ఈసారి కలుస్తూ ఉండేది  వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా కోసం కాదు.. సిద్దు జొన్నలగడ్డ సూపర్ సక్సెస్ సాధించిన టిల్లు స్క్వేర్ సినిమా కోసం.

టిల్లు స్క్వేర్ సినిమా 101.4 కోట్లు కలెక్ట్ చేసిందని నేడు ఈ సినిమా యూనిట్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటిస్తూ ఓ ఆసక్తికర విషయాన్ని కూడా తెలియజేశారు. సిద్ధూ జొన్నలగడ్డ రెండు సంవత్సరాల క్రితమే ఒక నేషనల్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో .. రాబోయే మూడు సంవత్సరాలలో నేను 100 కోట్లు కలెక్షన్స్ తెచ్చే స్టార్ అవ్వాలి అని చెప్పాడు. దీంతో ఈ విషయాన్ని షేర్ చేస్తూ చెప్పి మరీ సిద్ధూ 100 కోట్లు సాధించాడు అని చెప్పడంతో అంతా సిద్ధూని అభినందిస్తున్నారు.

ఇక ఈ విషయమే తెలియజేసిన సినిమా యూనిట్ వెంటనే టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ మీట్ రేపు ఏప్రిల్ 8న హైదరాబాద్ లో జరగనుంది అని అలానే ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నారు అని తెలియచేశారు.

 

కాగా టిల్లు స్క్వేర్ సినిమాని నిర్మాత నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో పాటు త్రివిక్రమ్ భార్య సౌజన్య ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై కలిసి నిర్మించారు. సౌజన్య పేరు ముందు ఉంచినా ఎక్కువగా ఈ బ్యానర్ నిర్మించే సినిమాలకు త్రివిక్రమ్ కనిపిస్తారు. గతంలో కూడా ఫార్ట్యూన్ ఫోర్, సితార సినిమాల ప్రమోషన్స్ కి త్రివిక్రమ్ తప్పకుండా హాజరయ్యారు. అలాగే టిల్లు స్క్వేర్ కథ ఫైనల్ చేసే ప్రాసెస్ లో త్రివిక్రమ్ హ్యాండ్ కూడా ఉన్నట్టు వినికిడి. దీంతో ఈ ఈవెంట్ కి త్రివిక్రమ్ కూడా ఆ సినిమా నిర్మాతగా రాబోతున్నట్టు సమాచారం.

దీంతో ఒకే వేదికపై మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కల్పించబోతున్నారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ గురించి ఏమి మాట్లాడుతారు…తాను జూనియర్ ఎన్టీఆర్ తో మరో సినిమా చేయనున్నాను అని చెబుతారా లేదా అనే విషయాలు తెలుసుకోవాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

Also Read: Tukkuguda Congress Meeting: కేసీఆర్ ను బహిరంగంగా ఉరితీయాలే.. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ..

Also Read: CM Revanth Reddy: పదేళ్లు అడవి పందుల్లా దోచుకున్నారు.. కేసీఆర్ కు సీఎం రేవంత్ ధమ్కీ.. వైరల్ గా మారిన వీడియో..

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x