Trivikram - Krishna Death: కృష్ణ మరణానికి కారణం త్రివిక్రమా? నెటిజెన్ వింత వాదన!

Trivikram - Krishna Death: సూపర్ స్టార్ కృష్ణ మరణానికి కారణం త్రివిక్రమ్ అంటూ ఒక నెటిజన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది, అతను చెప్పిన లాజిక్ దరిద్రంగా ఉందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ వివరాలు 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2022, 07:46 PM IST
Trivikram - Krishna Death: కృష్ణ మరణానికి కారణం త్రివిక్రమా? నెటిజెన్ వింత వాదన!

Trivikram Is Reason For Super Star Krishna Death: సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అనారోగ్యంతో కన్నుమూసినప్పుడు నుంచి అనేక రకాల వార్తలు ఆయన మరణం చుట్టూ తిరుగుతున్నాయి. నిజానికి ఆయన కార్డియాక్ అరెస్ట్ కావడంతో మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయి ఈ తెల్లవారు జామున మరణించారు. అయితే ఇప్పుడు ఆయన మరణానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కు లింక్ పెడుతూ కొందరు సోషల్ మీడియాలో అర్థంలేని రాతలు రాస్తున్నారు. అదేమిటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాలు చేస్తున్నప్పుడే హీరోల తండ్రులు చనిపోతున్నారని ఒక నెటిజన్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జల్సా సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ తండ్రి కొణిదెల  వెంకటరావు ఆరోగ్య కారణాలతో కన్నుమూశారని సదరు నెటిజన్ పేర్కొన్నారు. అంతేకాదు ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా చేస్తున్న సమయంలో ఆయన తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయారని అలా పవన్ -కళ్యాణ్ తండ్రి వెంకట్రావు, ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ చనిపోయారని సదరు నెటిజన్ పేర్కొన్నాడు.

అంతేకాక ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడని అందుకే మహేష్ బాబు తండ్రి కృష్ణ కూడా అనారోగ్య కారణాలతో చనిపోయారని ఆయన కామెంట్ చేశాడు. ఈ విషయం మీద పలువురు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని ఎక్కువమంది సదరు నెటిజన్ మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. త్రివిక్రమ్ చాలా మంది హీరోలతో సినిమాలు చేశాడని, అలా చేసిన హీరోల తండ్రులు బాగానే ఉన్నారని, యాదృచ్ఛికంగా జరిగిన విషయాన్ని అనవసరంగా పెద్దది చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.  

నిజానికి మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమా చేస్తున్నారు పూజా హెగ్డే హీరోయిన్గా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన క షెడ్యూల్ పూర్తయిన తర్వాత మహేష్ బాబు తల్లి చనిపోవడంతో రెండో షెడ్యూల్ వాయిదా పడింది. అయితే ఇప్పుడు కథ నచ్చకపోవడంతో మహేష్ బాబు సినిమా మొత్తం కథ మార్చమని చెప్పారని మహేష్ బాబు మాట మేరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సినిమా కధ అంతా మార్చారనే ప్రచారం ఉంది. ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు కానీ ఈ ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది.

Also Read: Superstar Krishna: అభిమానులకు బాడ్ న్యూస్.. గచ్చిబౌలి స్టేడియం నిర్ణయానికి బ్రేక్.. ఎందుకంటే?

Also Read: Krishnam Raju wife: కలిసే సినిమాలు చేశారు.. కలిసి చనిపోవాలని అనుకున్నారేమో?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News