Bholaa Shankar Poster : ఏంటి సామీ ఈ అరాచకం.. భోళా శంకర్‌లో చిరంజీవి ఇలా కనిపిస్తాడా?

Bholaa Shankar Fan Made Edit Poster మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే అది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని ఇట్టే తెలిసిపోతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2023, 04:57 PM IST
  • భోళా శంకర్ షూటింగ్‌ సెట్‌లో చిరు
  • వీరయ్య సక్సెస్ జోష్‌లో మెగాస్టార్
  • భోళా శంకర్ ఫ్యాన్ మేడ్ పోస్టర్
Bholaa Shankar Poster : ఏంటి సామీ ఈ అరాచకం.. భోళా శంకర్‌లో చిరంజీవి ఇలా కనిపిస్తాడా?

Bholaa Shankar Fan Made Edit Poster మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుత మంచి ఊపులో ఉన్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించిన కలెక్షన్లు చూస్తే ఎవ్వరి మతైనా పోవాల్సిందే. వీర సింహా రెడ్డిని పాతాళంలోకి నెట్టేసి.. వాల్తేరు వీరయ్య ఆకాశమంతా ఎత్తుకు ఎదిగాడు. ప్రపంచ వ్యాప్తంగా వాల్తేరు వీరయ్య సినిమా వీర విహారం చేస్తోంది. ఓవర్సీస్‌లో మొదటి మూడు నాలుగు రోజుల్లేనే బ్రేక్ ఈవెన్ అయింది. మొదటి వారం ముగిసే సరికి అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది.

ఇంకా రెండో వారంలోనూ వీరయ్య హవా సాగుతోంది. తెలుగులో ఈ వారం వచ్చిన ఏ సినిమా కూడా అంతగా హిట్ అవ్వలేదు. దీంతో వాల్తేరు వీరయ్యకు మరో వారం కలిసి వచ్చినట్టుగా అయింది. పఠాన్ హిట్ అయినా కూడా దాని ప్రభావం వీరయ్య మీద పడినట్టు అనిపించడం లేదు. దీంతో చిరంజీవి కెరీర్‌లో వీరయ్య బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే చాన్స్ ఉంది.

దీంతో చిరంజీవి రెట్టింపు ఉత్సాహంతో భోళా శంకర్ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాడు. అజిత్ నటించిన వేదాళం సినిమాను ఇప్పుడు బోళా శంకర్‌గా మెహర్ రమేష్‌ తీస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం చిరంజీవి గుండు లుక్కును కూడా ట్రై చేశాడు. అప్పట్లో గుండుతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

అయితే ఇప్పుడు చిరంజీవి కొత్త లుక్‌కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఫ్యాన్ మేడ్ పోస్టర్లని తెలుస్తోంది. ఇందులో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో చిరంజీవి కనిపిస్తున్నాడు. వేదాళంలో అజిత్‌ కనిపించినట్టుగానే చిరంజీవి ఈ ఫోటోల కనిపిస్తున్నాడు. ఒక వేళ ఈ లుక్ కూడా సినిమాలో ఉంటే అది వేరే లెవెల్ అరాచకంగా ఉంటుంది. మరి ఈ లుక్‌ను మెహర్ రమేష్‌ తన లెక్కలోకి తీసుకుంటాడా? లేదా? అన్నది చూడాలి.

భోళా శంకర్ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. కీర్తి సురేష్‌ చెల్లిగా నటిస్తుంది. దివి, శ్రీముఖి, లోబో ఇలా చాలా మంది ఈ సినిమాలో కనిపించనున్నారు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకు అదిరిపోయే పాటలను రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదలయ్యే అవకాశం ఉంది.

Also Read:  Hunt Telugu Movie Review : హంట్ రివ్యూ.. సుధీర్ బాబు డేరింగ్ స్టెప్ 

Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News