Tunisha Sharma Struggled Financially in Last Days: తునీషా శర్మ ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తూనే ఉంది. 'అలీ బాబా: దస్తాన్-ఎ-కాబుల్' లో లేడీ లీడ్ నటి తునీషా శర్మ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ప్రతిరోజూ కొత్త విషయాలు తెర మీదకు వస్తున్నాయ్. తన కుమార్తె మరణానికి ఆమె సహనటుడు, మాజీ ప్రియుడు షీజన్ ఖాన్‌పై తునీషా తల్లి అన్ని ఆరోపణలు చేసింది. అదే సమయంలో, షీజన్ ఖాన్ తల్లి అతని సోదరీమణులు కూడా విలేకరుల సమావేశం ద్వారా తునీషాతో తమ అనుబంధాన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా తునీషా 21వ పుట్టినరోజున షీజాన్ ఖాన్ సోదరి ఫలక్ నాజ్ మరియు ఆమె తల్లి ఇద్దరూ తమదైన రీతిలో నటిని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తునీషా చివరి చాట్‌ను షీజన్ ఖాన్ తల్లి పంచుకుకోగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తునీషా చనిపోవడానికి 73 రోజుల ముందు జరిగిన ఈ చాట్‌లో తునీషా షీజన్ తల్లికి తాను ఎప్పుడూ మీతోనే ఉంటానని చెప్పింది. ఈ పోస్ట్‌లోని చిత్రాలతో పాటు, షీజాన్ ఖాన్ తల్లి కహ్కషన్ కూడా తునీషా కోసం సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశారు, ఇందులో ఆమె నటిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురవుతుంది.
ఇక చాట్‌లో, తునీషా షీజన్ తల్లితో 'నాతో ఎవరూ నిలబడనప్పుడు, మీరు ఎల్లప్పుడూ నిలబడతారని నాకు తెలుసు, నేను మీ ఇద్దరినీ చాలా ప్రేమిస్తున్నాను. చింతించకండి అంతా బాగానే ఉంటుంది. నేనిక్కడే మీతో ఉన్నానని పేర్కొన్నారు. దీనికి షీజన్ తల్లి స్పందిస్తూ, 'నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండమ్మా, నీ ఆరోగ్యం బాగుండాలని రాసుకొచ్చింది. మరోపక్క తునీషాతో కలిసి పనిచేసిన నటి సోనియా సింగ్ ఇటీవల ఒక షాకింగ్ విషయం వెల్లడించింది. తునీషా తనను 3000 రూపాయల అప్పు అడిగిందని సోనియా చెప్పుకొచ్చారు.
డిసెంబర్ 14 న తాము కలిసినప్పుడు తునీషా చాలా డిస్టర్బ్ గా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో తునీషా తనతో షీజన్ గురించి కూడా మాట్లాడినట్టు సోనియా వెల్లడించింది, ఈ సమయంలో, తునీషా సోనియాతో, 'షీజన్‌కు కొంత స్పేస్ కావాలి, నేను ప్రేమ గురించి మాట్లాడటం అతనికి ఇష్టం లేదు' అని ఆమె చెప్పిందని సోనియా పేర్కొంది. ఇది విన్న సోనియా.. రిలేషన్ షిప్ లో ఇదంతా జరుగుతుందని తునీషాకు వివరించానని చెప్పుకొచ్చింది.
తునీషాకు డబ్బు కొరత ఎక్కువగా ఉండేదని, ఇటీవల ఆమె నన్ను 3000 రూపాయలు అడిగినప్పుడు, ఆమె వద్ద అంత డబ్బు కూడా లేదా అని నేను ఆమెను అడిగానని సోనియా చెప్పారు. షీజన్ కుటుంబాన్ని తునీషా తన కుటుంబంగా భావించడం ప్రారంభించిందని ఆమె షీజన్ కుటుంబ సభ్యులను కూడా వరుసలతో పిలవడం ప్రారంభించిందని చెప్పుకొచ్చింది. అయితే తునీషా తల్లి షీజన్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. షీజన్ తన కూతురిని కొట్టేవాడని, ఇస్లాం మతంలోకి మారమని బలవంతం చేస్తున్నాడని తునీషా తల్లి వనిత ఆరోపణలు గుప్పించింది.
Also Read: Veera Simha Reddy Pre Release: ఒంగోలులోని వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook