Udvegam Movie Review: ‘ఉద్వేగం’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే కోర్ట్ రూమ్ డ్రామా..

Udvegam Movie Review:తెలుగు సహా వివిధ భాషల్లో కోర్టు నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుందనే విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో తెరకెక్కిన మరో ఎమోషనల్ కోర్ట్ డ్రామా మూవీ ‘ఉద్వేగం’. ఈ శుక్రవారం విడుదల కాబోతుంది. మరి  ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా.. ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 28, 2024, 01:39 PM IST
Udvegam Movie Review: ‘ఉద్వేగం’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే కోర్ట్ రూమ్ డ్రామా..

రివ్యూ: ఉద్వేగం
నటీనటులు: త్రిగుణ్, దీప్సిక, సురేశ్, పరుచూరి గోపాలకృష్ణ, శివ కృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, అంజలి తదితరులు
ఎడిటర్: జశ్వీన్ ప్రభు
సంగీతం: కార్తిక్ కొడగండ్ల
సినిమాటోగ్రఫీ: జి.వి. అజయ్ కుమార్
బ్యానర్స్: కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: జి శంకర్, ఎల్ మధు
దర్శకుడు: మహిపాల్ రెడ్డి

కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై జి. శంకర్, ఎల్. మధు తెరకెక్కించిన మూవీ  ఉద్వేగం. త్రిగుణ్ లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. కోర్టు రూమ్  డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు మహిపాల్ రెడ్డి డైరెక్ట్ చేశారు.ఈ మూవీలో దీప్సిక హీరోయిన్ గా నటించింది. ఒకప్పటి హీరో సురేశ్, ప్రముఖ రచయత పరుచూరి గోపాలకృష్ణ ముఖ్యపాత్రల్లో నటించారు. మరో కీలక పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ యాక్ట్ చేశారు. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తో ఈ ఈ సినిమాపై అంచనాలు పెరిగపోయాయి. ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ:
మహీంద్రా (త్రిగుణ్) న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తుంటాడు.ముఖ్యంగా క్లిష్టమైన క్రిమినల్ కేసులను డీల్ చేయడంలో సిద్దహస్తుడు.  లాయర్ వృత్తినే జీవితంగా భావించే మహీంద్రా  అమ్ములు (దీప్షిక)ను ప్రేమిస్తుంటాడు. సాఫీగా సాగిపోతున్న  మహీంద్రా లైఫ్ లోకి  గ్యాంగ్ రేప్ కేసు వస్తోంది. ముందుగా ఈ కేసును టేకప్ చేయడానికి మహీంద్రా ఒప్పుకోడు. కానీ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఈ కేసుని వాదించడానికి ఒప్పుకుంటాడు.  ఆ కేసులో A2 అయిన సంపత్ అనే నిందితుడి కోసం వాదించడానికి మహీంద్రా రంగంలోకి దిగుతాడు. మరోవైపు ప్రసాద్ (శ్రీకాంత్ అయ్యంగార్) అమ్మాయి వైపు నుండి ఈ కేసును టేకప్ చేస్తాడు. అసలు ఈ కేసు కారణంగా మహీంద్రా వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఫేస్ చేసాడు. ఈ గ్యాంగ్ రేప్ కేసుని మహీంద్రా ఎలా డీల్ చేశాడు? సంపత్ ని ఆధారాలతో కేసు నుంచి బయట పడేసాడా? చివరికి న్యాయం గెలిచిందా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ.  

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
తెలుగు సహా వివిధ భాషల్లో కోర్టు రూమ్ డ్రామా నేపథ్యం అనేది సక్సెస్ ఫుల్ ఫార్ములా అని చెప్పాలి. దర్శకుడు మహిపాల్ ఈ పాయింట్ ను బేస్ చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఉద్వేగం టైటిల్ తగ్గట్టు ఈ సినిమాలో క్రైమ్, ఎమోషన్స్ ను రెండింటిని మేళవించి తెరకెక్కించాడు. అయితే.. దర్శకుడు ఈ సినిమాలో హీరో.. రేప్ చేసిన A2 నిందితుడి తరుపున వాదించడం అనేదే ఈ సినిమాలో పెద్ద ట్విస్ట్. అలా ఎందుకు చేసాడనేదే ఈ సినిమాలో కన్విన్సింగ్ గా చెప్పాడు దర్శకుడు. ముఖ్యంగా చూసే ఆడియన్స్ కు అమ్మాయికి న్యాయం జరగాలి. హీరో గెలవాలి అనిపిస్తోంది. ఇలా పరస్పర విరుద్ధమైన ఈ పాయింట్ ను దర్శకుడు టేకప్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నటీనటుల నుంచి మంచి ఔట్ పుట్ రాబట్టుకొన్నాడు. మొత్తంగా ఇప్పటి వరకు తెలుగు తెరపై కొత్త  కాన్సెప్ట్ ను సరికొత్త చూపించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అంతేకాదు చూసే ప్రేక్షకులు ఉద్వేగానికి గురయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు.

సినిమా కాస్త నెమ్మదిగా స్టార్ట్ అయినా.. ఆ తర్వాత కథను జెట్  స్పీడ్ లో ఉరికించాడు. నెక్ట్స్ సీన్ లో ఏమవుతుందో ఉత్సుకత కలిగించాడు. ముఖ్యంగా త్రిగుణ్, శ్రీకాంత్ అయ్యంగార్ మధ్య సీన్స్ ప్రేక్షకులను ఎంగేజ్  చేస్తాయి. ఈ సినిమాలోని సన్నివేశాలను నిజ జీవితంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకొని దర్శకుడు తెరకెక్కించాడు. ఈ సినిమాను మొదటి ఇరవై నిమిషాలు ఏదో ల్యాగ్ ఉన్నట్టు కనిపించాడు. ఆ తర్వాత కథలో లీనం చేయడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అజయ్ కుమార్ కెమెరా వర్క్ బాగుంది. జశ్వీన్ ప్రభు ఎడిటింగ్ పర్వలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన కార్తీక్ కొడకండ్ల తన పనికి న్యాయం చేశారు.  

నటీనటుల విషయానికొస్తే:
యువ న్యాయవాదిగా  త్రిగుణ్ నటన బాగుంది. ఈ పాత్రలో జీవించాడు. యాక్టింగ్ లో  పరిణితి కనపడింది.  దీప్షిక తన క్యారెక్టర్ కు న్యాయం చేసింది. త్రిగుణ్ తో కలిసి ఉన్న ఎమోషనల్ సీన్స్ లో మెప్పించింది. త్రిగుణ్ గురువు పాత్రలో చాలా యేళ్ల తర్వాత పరుచూరి గోపాలకృష్ణ తన మార్క్ నటనతో మెప్పించారు. జడ్జ్ గా సీనియర్ హీరో సురేష్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో మెప్పించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.

పంచ్ లైన్..‘ఉద్వేగం’..ఉద్వేగభరితమైన కోర్టు డ్రామా..

రేటింగ్:2.75/5

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News