Upasana Konidela Delivery : ఉపాసనకు డెలివరీ జరిగేది ఎక్కడంటే.. ఆపరేషన్ చేసే డాక్టర్ల వివరాలివే

Upasana Konidela Delivery ఉపాసన కొణిదెల డెలివరీకి సంబంధించిన న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఉపాసన ఇండియాలోనే ఆపరేషన్ చేయించుకుంటుందట. అది కూడా అపోలోలోనే చేసుకుంటుందట. కాకపోతే ఇంటర్నేషనల్ స్పెషలిస్ట్‌ల ఆధ్వర్యంలోనే ఆ ఆపరేషన్ జరుగుతుందట.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2023, 04:51 PM IST
  • నెట్టింట్లో ఉపాసన డెలివరీపై చర్చ
  • అపోలో హాస్పిటల్‌లోనే ఆపరేషన్
  • వరల్డ్ ఫేమస్ డాక్టర్ల ఆధ్వర్యంలో ఆపరేషన్
Upasana Konidela Delivery : ఉపాసనకు డెలివరీ జరిగేది ఎక్కడంటే.. ఆపరేషన్ చేసే డాక్టర్ల వివరాలివే

Upasana Konidela Delivery మెగా కోడలు ఉపాసన ఇప్పుడు అభిమానుల్లో సంతోషాన్ని నింపే న్యూస్ ఒకటి లీక్ చేసింది. ఇన్ని రోజులు ఉపాసనది సరోగసి అని రూమర్లు వచ్చాయి. కానీ ఇప్పుడు ఉపాసనది సహజ గర్భం అని, డెలివరీ కూడా ఇండియాలోనే జరుగుతుందని లీక్ చేసింది ఉపాసన. ఇక ఆ ఆపరేషన్ చేసే డాక్టర్ల వివరాలను కూడా బయటపెట్టేసింది ఉపాసన. ఉపాసన తాజాగా చేసిన ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మెగా ఫ్యామిలీ దాదాపు పదేళ్లు ఎదురుచూస్తున్న తరుణం రాబోతోంది. మెగా వారసుడిని ఎప్పుడెప్పుడు చూస్తామా? అని మెగా ఫ్యాన్స్ అంతా కూడా వేయి కళ్లతో ఎదురుచూడసాగారు. రామ్ చరణ్‌ ఉపాసనలు తల్లిదండ్రులు ఎప్పుడు అవుతారా? అని ఇన్నేళ్లు అభిమానులు అనుకుంటూ ఉండేవారు. ఉపాసన గర్భం దాల్చిందని, రామ్ చరణ్‌ తండ్రి కాబోతోన్నాడని చిరంజీవి ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్‌లో ఆనందాలు అవధులు దాటేశాయి.

అయితే ఉపాసన గర్భం దాల్చిందని చిరంజీవి ప్రకటించిన వెంటనే.. అది సరోగసి అని, కృత్రిమ గర్భం అని కామెంట్లు వినిపించాయి. ఆ తరువాత కొన్ని చోట్ల ఉపాసన బేబీ బంప్ పిక్స్ కూడా దర్శనమిచ్చాయి. దీంతో అది సహజ గర్భమే అని అంతా అనుకున్నారు. కానీ ఉపాసన గర్భంలో ఎలాంటి మార్పులు కనిపించకపోవడంతో పదే పదే సోషల్ మీడియాలో సరోగసి మీద చర్చలు జరుగుతూ వచ్చాయి.

ఇప్పుడు ఉపాసన తన డెలివరీ గురించి స్వయంగా ప్రకటించింది. ఇండియాలో డెలివరీ చేయించుకుంటానని, అది కూడా అపోలో హాస్పిటల్‌లోనే చేయించుకుంటానని ఉపసాన చెప్పుకొచ్చింది. అంతే కాకుండా సుమన మనోహర్, రూమా సిన్హాలు ఆపరేషన్ చేస్తారని, మీరు (డా.జెన్నిఫర్ ఆస్టన్) కూడా రావొచ్చుగా అని మరో అంతర్జాతీయ డాక్టర్‌ను ఉపాసన కోరింది. దీంతో ఆ డాక్టర్ సైతం వస్తానని చెప్పుకొచ్చింది.

ఇక రామ్ చరణ్‌కు పుట్టబోయే బిడ్డ మీద మాత్రం మెగా ఫ్యామిలీలో చాలా అంచనాలే ఉన్నాయి. చిరు పెద్ద కూతురు సుష్మిత అయితే.. రామ్ చరణ్‌కు కొడుకు పుట్టాలని కోరుకుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తమ ఇంట్లో ఆడపిల్లలే పుడుతూ వచ్చారని, రామ్ చరణ్‌కు కొడుకు పుడితే బాగుంటుందని సుష్మిత తన మనసులోని కోరికను చెప్పుకొచ్చింది.

Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?

Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News