Varun Tej: అల్లు అర్జున్‌కు ఇచ్చిపడేసిన వరుణ్‌ తేజ్‌.. 'ఎక్కడి నుంచో వచ్చామో మరవద్దు' అంటూ కౌంటర్‌

Varun Tej Did Strong Counter To Allu Arjun: కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య వివాదానికి హీరో వరుణ్‌ తేజ్‌ మరో ఆజ్యం పోసినట్టు కనిపిస్తోంది. తన సినిమా వేడుకలో చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేసినట్లు చర్చ జరుగుతోంది. వరుణ్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 11, 2024, 12:33 PM IST
Varun Tej: అల్లు అర్జున్‌కు ఇచ్చిపడేసిన వరుణ్‌ తేజ్‌.. 'ఎక్కడి నుంచో వచ్చామో మరవద్దు' అంటూ కౌంటర్‌

Varun Tej vs Allu Arjun: సినీ పరిశ్రమలో కొణిదెల, అల్లు కుటుంబం మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. కుటుంబ వివాదాల మధ్య రాజకీయాలు కూడా భాగమవడంతో ఆ కుటుంబాల మధ్య దూరం మరింత పెరిగిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న అల్లు అర్జున్‌కు తాజాగా అతడి బావ.. హీరో వరుణ్‌ తేజ్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. 'ఎక్కడి నుంచి వచ్చామో మరచిపోవద్దు. మన వెనుకాల ఎవరు ఉన్నారనేది మరచిపోతే ఆ విజయం దేనికి పనికి రాదు' అంటూ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఆ వ్యాఖ్యలు అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేసినవే అనే చర్చ జరుగుతోంది. 

Add Zee News as a Preferred Source

Also Read: Game Changer: ఏకంగా శంకర్ ను అంత మాట అనేసిన రామ్ చరణ్.. వైరల్ అవుతున్న కామెంట్స్..

కరుణకుమార్‌ దర్శకత్వంలో మీనాక్షి చౌదరి జోడీగా వరుణ్‌ తేజ్‌ 'మట్కా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈనెల 14వ తేదీన సినిమా విడుదల సందర్భంగా ఆదివారం సాయంత్రం విశాఖపట్టణంలో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'గద్దలకొండ గణేశ్‌ తర్వాత కొంచెం దారి తప్పాను. మట్కా ద్వారా అందరికీ నచ్చే ఒక మాస్‌ చేయాలనుకున్నా. ఈ సినిమాలో నాలోని నటుడిని నిజాయతీగా దర్శకుడు బయటకు తీసుకొచ్చారు' అని వరుణ్‌ తేజ్‌ తెలిపాడు.

Also Read: Unstoppable Season 4 Promo: పుష్ప 3లో బాలయ్య.. అఖండ 3లో అల్లు అర్జున్ .. అన్ స్టాపబుల్ షో లో పుష్ప రాజ్ సెన్సేషన్..

'నా సినిమానే మాట్లాడాలని నమ్మే వ్యక్తిని నేను. అయితే సినిమాలు సక్రమంగా ఆడకపోతే బాధ వస్తుంది. మూడు రోజుల కిందట మట్కా సినిమా గురించి ఆలోచిస్తూ నా భార్య లావణ్యతో మాట్లాడి పడుకున్నా' అని వరుణ్‌ తేజ్‌ తెలిపాడు. 'ఆ తెల్లారే మా అన్న రామ్‌ చరణ్‌ ఫోన్‌ చేసి మాట్లాడాడు. ఆయన పక్కన కూర్చుని భుజం మీద చేయి వేస్తే అదే రూ.100 కోట్లు. భావోద్వేగంగా నాకు ఎప్పుడూ రామ్‌ చరణ్‌ అన్న అండగా ఉన్నాడు' అని వరుణ్‌ భావోద్వేగానికి లోనయ్యాడు.

తన కుటుంబం గురించే పదే పదే ప్రస్తావించడంపై వరుణ్‌ తేజ్‌ వివరణ ఇచ్చాడు. 'ఎప్పుడు కుటుంబం గురించే మాట్లాడతాడేమిటి? అనుకోవచ్చు. ఎందుకంటే జీవితంలో మనం ఎక్కడి నుంచి వచ్చాం? మన వెనుకాల ఎవరు ఉన్నారనేది మరచిపోతే ఆ విజయం దేనికి పనికి రాదు' అని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 'మా పెద్దనాన్న (చిరంజీవి), బాబాయ్‌ (పవన్‌ కల్యాణ్‌), మా నాన్న (నాగబాబు) నా వెనకాల ఉన్నారు' వరుణ్‌ వివరించాడు. ఈ సందర్భంగా తన భార్య లావణ్య త్రిపాఠి విషయమై స్పందిస్తూ 'నేను ఎక్కడ ఉన్నా తనకంటే ఎక్కువగా నన్ను చూసుకుంటూ సహకరిస్తోంది' అని తెలిపాడు.

ఇవన్నీ పక్కన పెడితే వరుణ్‌ చేసిన 'మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది మరచిపోవద్దు' అని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కుటుంబానికి దూరంగా అల్లు అర్జున్‌ వెళ్తుండడం.. భారీ విజయాలు పొందుతుండడంతో అతడి గురించే వరుణ్‌ తేజ్‌ స్పందించాడని చర్చ జరుగుతోంది. పుష్ప 2 సినిమా త్వరలో రాబోతున్నది. ఈ సినిమా కూడా భారీ విజయం అందుకోబోతుండడంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే అలాంటిదేమీ లేదని.. తన సినిమాలు ఫ్లాపవుతున్న సమయంలో తనకు తన కుటుంబం ఎంత అండగా ఉందో వరుణ్ తేజ్ చెప్పారని సినీ విమర్శకులు చెబుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News