Unstoppable Season 4 Promo: పుష్ప 3లో బాలయ్య.. అఖండ 3లో అల్లు అర్జున్ .. అన్ స్టాపబుల్ షో లో పుష్ప రాజ్ సెన్సేషన్..

Unstoppalbe Season 4 E 4 Promo: బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తూన్న అన్ స్టాపబుల్ షో సక్సెస్ పుల్ గా మూడు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం నాల్గో సీజన్ నడుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు, దుల్కర్ సల్మాన్, సూర్య లతో మూడు ఎపిసోడ్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. సీజన్ 4లో నాల్గో ఎపిసోడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేసారు. దానికి సంబంధించిన ప్రోమో విడుదల చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 10, 2024, 12:29 PM IST
Unstoppable Season 4 Promo: పుష్ప 3లో బాలయ్య.. అఖండ 3లో అల్లు అర్జున్ .. అన్ స్టాపబుల్  షో లో పుష్ప రాజ్ సెన్సేషన్..

Unstoppalbe Season 4 E 4 Promo: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 1లో పుష్ప రాజ్ గా సందడి చేసిన ఐకాన్ స్టార్.. తాజాగా నాల్గో సీజన్ లో నాల్గో ఎపిసోడ్ లో మరోసారి పుష్ఫ రాజ్ గా అఖండతో సందడి చేయబోతున్నారు. త్వరలో విడుదల కానున్న పుష్ప 2 నేపథ్యంలో అల్లు అర్జున్ .. ఈ షోలో మరోసారి సందడి చేయడం విశేషం. ఈ సందర్బంగా బాలయ్య, అల్లు అర్జున్ మధ్య చిరంజీవి ప్రస్తావన వచ్చింది. అంతేకాదు మన ఇద్దరం రిలేటివ్స్ అవుతాం అంటూ చిన్న హింట్ ఇచ్చారు. నేను కృష్ణుడిని .. నువ్వు అర్జునుడివి అంటూ బాలయ్య ఛలోక్తులు విసిరారు. దానికి అల్లు అర్జున్.. మీరు గీత ఇవ్వండి.. నేను కురుక్షేత్రం చేస్తాను.

Add Zee News as a Preferred Source

నువ్వు నాకు పార్టీ ఇవ్వలేదు అన్న బాలయ్య ప్రశ్నకు .. మీ మాన్షన్ లో హౌస్ పార్టీ చేసుకుందాం అన్నారు. నేషనల్ అవార్డు రాగానే మొదట ఏమి అనిపించిందని బాలయ్య ప్రశ్నకు.. నేషనల్ అవార్డు ఎవరెవరికి వచ్చిందా అని చెక్ చేస్తే.. ఒక్క తెలుగు నటుడి పేరు లేదు. దాన్ని రౌండప్ చేసి కొట్టాలని ఫిక్స్ అయి కొట్టాను.నీకు యాక్షన్ ఇష్టమా.. రొమాన్స్ ఇష్టమా అనే ప్రశ్నకు.. తొక్కలో యాక్షన్.. రొమాన్స్ అంటే ఇష్టం అన్నారు. అమ్మాయిల విషయంలో ఏదైనా అన్యాయం జరిగితే కోపం వస్తుందన్నారు. నీకు రష్మిక  కంటే పూజా హెగ్డేతో పనిచేయడం ఇష్టమట అని బాలయ్య క్వశ్చన్ వేయడం. దానికి అల్లు అర్జున్ చెప్పిన సమాధానం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు మీరు పుష్ప 3 చేయండి.. నేను అఖండ 3 చేస్తా అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగులు గూస్ బంప్స్ తెప్పించాయి.

ఈ షోలో అల్లు అర్జున్ వాళ్ల అమ్మ నిర్మల గారు హాజరై సందడి చేసారు. చిన్నపుడు అమ్మ తనను ఎలా తనను ఎలా దండించిందనే  విషయాన్ని ప్రస్తావించాడు అల్లు అర్జున్. ఏ వెపన్ వల్ల నువ్వు మారావు అనే దానికి.. స్నేహారెడ్డి అనే వెపన్  వల్ల మారాననే విషయాన్ని ప్రస్తావించారు. మొత్తంగా ఈ నెల 15న ఆహాలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ ఎపిసోడ్ లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తదో చూడాలి.

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News