/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Venkatesh : హీరో విక్టరీ వెంకటేష్ అంటేనే వివాదాలకు ఆమడ దూరంలో ఉండే వ్యక్తి. ఎపుడు ఎలాంటి ఇష్యూపై పెద్దగా గొడవ పడ్డ సందర్భాలు లేవు. కానీ ఓ ప్రాపర్టీ విషయంలో వెంకటేష్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని నాంపలి క్రిమినల్ కోర్టు ఆదేశాలు జారీ చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. అప్పట్లో ఈ ప్రాపర్టీని కూల్చొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఆ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ కూల్చివేతకు దగ్గబాటి కుటుంబ సభ్యులు పాల్పడ్డారని నంద కుమార్ అనే వ్యక్తి కంప్లైట్ చేశారు. రూ. కోట్ల విలువ చేసే బిల్డింగ్ కూల్చివేసి అందులో ఉన్న ఫర్నీచర్ ఎత్తుకెళ్లారని సదురు వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఈ విషయమై వెంకటేష్‌తో పాటు ఆయన అన్న సురేష్ బాబు, రానా దగ్గుబాటి, అభిరామ్ లపై కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

ఇక విక్టరీ వెంకటేష్ సినిమాల విషయానికొస్తే.. ఈ యేడాది సంక్రాంతి బరిలో 'సైంధవ్' మూవీతో పలకరించాడు.ఐతే పొంగల్  సినిమాల్లో హనుమాన్, గుంటూరు కారం వంటి సినిమాలతో పాటు తన తరం హీరో నాగార్జున హీరోగా నటించిన 'నా సామి రంగ' సినిమాలు విడుదలయ్యాయి. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'సైంధవ్' మూవీకి మంచి టాక్ వచ్చినా.. సంక్రాంతి సినిమాల్లో పోటీ కారణంగా ముఖ్యంగా ప్రశాంత్ వర్మ.. హను మాన్‌తో పాటు మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల 'గుంటూరు కారం' సినిమాల మధ్య నలిగిపోయింది. అటు నాగార్జున నటించిన 'నా సామి రంగ' సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా విడుదలై మంచి సక్సెస్‌ను అందుకుంది. ఇక వెంకటేష్ నటించిన సైంధవ్ విషయానికొస్తే.. ఈ మూవీలో యాక్షన్ కమ్ పాప సెంటిమెంట్ పాళ్లు ఎక్కువగా ఉన్నా..   విపరీతమైన హింస కారణంగా ఈ మూవీ పొంగల్ పోటీలో నిలబడలేకపోయింది. తన బేస్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరంగా ఈ సినిమా ఉండటం సైంధవ్‌కు మైనస్‌గా మారింది.

ఇక 'సైంధవ్' సినిమా వెంకటేష్ కు 75వ సినిమా. తన లాండ్ మార్క్ మూవీని దర్శకుడు శైలేష్ కొలను బాగానే తెరకెక్కించినా.. హీరోకు విలన్స్ ఎందుకు భయపడతారనే విషయాన్ని తెరపై కన్విన్స్‌గా చెప్పడంలో విఫలమయ్యాడు. తన గత రెండు చిత్రాలు 'హిట్ -1, హిట్ -2 చిత్రాలను పోలీస్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించిన శైలేష్ కొలను.. ఈ చిత్రాన్ని మాఫియా బ్యాక్ డ్రాప్‌లో సరికొత్తగా ప్రెజెంట్ చేసినా.. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ముఖ్యంగా ఇలాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టేనర్‌లను సోలోగా రిలీజ్ చేస్తే మంచి ప్రయోజనం అయినా దక్కేది. కానీ సంక్రాంతి సీజన్ అంటూ ఎగబడి మొత్తానికి ఎసరు తెచ్చుకున్నారు. ఏది ఏమైనా తన కెరీర్‌లో లాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతుందనున్న 'సైంధవ్' వెంకటేష్‌కు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.

సైంధవ్ మూవీ  రూ. 30 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ కనీసం రూ. 10 కోట్ల షేర్ రాబట్టలేక చతికిల బడింది. ఈ నేపథ్యంలో ఈ మూవీని విడుదలైన మూడు వారాల్లోనే ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రానున్నట్టు సమాచారం. త్వరలో స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ మూవీ శాటిలైట్ హక్కులను ఈటీవీ దక్కించుకుంది.

ఇదీ చదవండి: మీపేరు ఈ 2 అక్షరాలతో మొదలవుతుందా? అయితే, మీలవ్ బ్రేకప్..

ఇదీ చదవండి:  ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
venkatesh got big shock summons issued by nampally court here are the details ta
News Source: 
Home Title: 

Venkatesh : వెంకటేష్‌ ఫ్యామిలీకి బిగ్ షాక్ ఇచ్చిన కోర్టు..

Venkatesh : వెంకటేష్‌ ఫ్యామిలీకి బిగ్ షాక్ ఇచ్చిన కోర్టు..
Caption: 
Venkatesh court summons (Source/X)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Venkatesh : వెంకటేష్‌ ఫ్యామిలీకి బిగ్ షాక్ ఇచ్చిన కోర్టు..
TA Kiran Kumar
Publish Later: 
No
Publish At: 
Monday, January 29, 2024 - 14:43
Created By: 
Kiran Kumar
Updated By: 
Kiran Kumar
Published By: 
Kiran Kumar
Request Count: 
36
Is Breaking News: 
No
Word Count: 
410