Venkatesh, mahesh babu: కరోనాపై మహేష్ బాబు, వెంకటేష్ పోరాటం

PM Modi's #unite2fightcorona : కరోనాని యావత్ దేశం సమిష్టిగా ఎదుర్కోవాలి అని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీ 'యునైట్‌2ఫైట్‌కరోనా' అనే నినాదానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు మోదీ తన ట్విట్టర్‌ ద్వారా ఈ పోస్ట్‌ని ప్రజలతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఇండియాలో కరోనావైరస్ రికవరీ రేటు ఐతే పెరిగింది కానీ, రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య ( Coronavirus cases ) మాత్రం తగ్గడం లేదు.

Last Updated : Oct 10, 2020, 11:58 PM IST
Venkatesh, mahesh babu: కరోనాపై మహేష్ బాబు, వెంకటేష్ పోరాటం

PM Modi's #unite2fightcorona : కరోనాని యావత్ దేశం సమిష్టిగా ఎదుర్కోవాలి అని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీ 'యునైట్‌2ఫైట్‌కరోనా' అనే నినాదానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు మోదీ తన ట్విట్టర్‌ ద్వారా ఈ పోస్ట్‌ని ప్రజలతో పంచుకున్న సంగతి తెలిసిందే.

ఇండియాలో కరోనావైరస్ రికవరీ రేటు ఐతే పెరిగింది కానీ, రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య ( Coronavirus cases ) మాత్రం తగ్గడం లేదు. అందుకే కరోనాకి మెడిసిన్ వచ్చే వరకు ఎవరు తక్కువ అంచనా వేయొద్దు అని తెలిపారు. అలాగే ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అంశాలు మాస్క్ ధరించడం, చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం ( Wear mask, wash your hands, Social distancing). దీంతో సమిష్టిగా కరోనాని జయించగలం అని ప్రధాని మోదీ ట్వీట్ చేసారు. Also read : Bigg boss 4 Telugu contestant : కంటెస్టంట్స్‌కి నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్

దీనిపై టాలీవుడ్‌ పెద్దోడు విక్టరీ వెంకటేష్‌ ( Venkatesh ), చిన్నోడు సూపర్ స్టార్ మహేష్‌ బాబు ( Mahesh Babu ) స్పందించారు. కరోనాని అంత తేలికగా తీసుకొవద్దని, కరోనాకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని వారి అభిమానులకు విజ్ఞప్తిచేశారు. తాను ఎలాగైతే కరోనాకి వ్యతిరేకంగా పోరాడుతున్నానో, ప్రజలందరూ కూడా అలాగే కరోనాకి వ్యతిరేకంగా పోరాడాలని విఙప్థి చేస్తూ విక్టరీ వెంకటేష్ ఓ వీడియోను ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో వెంకీ తన వయసును దాచుకోకుండా ఒరిజినల్ గెటప్‌లోనే కనిపించాడు. Also read : Gangavva to leaves Big Boss 4 Telugu: బిగ్ బాస్ షోలో కన్నీళ్లు పెట్టుకున్న గంగవ్వ.. గంగవ్వకు వెళ్లాలని లేకున్నా..

అలాగే మహేష్‌ బాబు ( Mahesh Babu's fight against Coronavirus ) స్పందిస్తూ, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి సమిష్టిగా పోరాటం చేయడం ఒక్కటే మార్గం అని తెలిపారు. అంతే కాకుండా ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించండి, తరచుగా చేతులు కడుక్కోండి, సామాజిక దూరం పాటించండి అని మహేష్ బాబు మరోసారి గుర్తుచేశారు. Also read : Shakuntalam from Gunasekhar: మరో భారీ ప్రాజెక్ట్ ప్రకటించిన గుణశేఖర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News