Bichagadu 2 Trailer : దుమ్ములేపేసిన బిచ్చగాడు 2 ట్రైలర్.. హిట్టు కొటేసేలా విజయ్ ఆంటోని

Bichagadu 2 Movie Trailer Out విజయ్ ఆంటోని సినిమాలకు తెలుగులో మంచి గిరాకీ ఉంటుంది. బిచ్చగాడు సినిమా తెలుగులో వంద రోజులకు పైగా ఆడింది. డబ్బింగ్ సినిమానే అయినా కూడా విజయ్ ఆంటోని బిచ్చగాడు బ్లాక్ బస్టర్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2023, 04:13 PM IST
  • బిచ్చగాడు 2 ట్రైలర్ విడుదల
  • పాన్ ఇండియా లుక్‌తో బిచ్చగాడు
  • విజయ్ ఆంటోనికి హిట్ పక్కా?
Bichagadu 2 Trailer : దుమ్ములేపేసిన బిచ్చగాడు 2 ట్రైలర్.. హిట్టు కొటేసేలా విజయ్ ఆంటోని

Vijay Antony Bichagadu 2 Trailer విజయ్ ఆంటోని సినిమాలు ఎప్పుడూ కూడా ప్రయోగాత్మకంగా ఉంటాయి. విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాతో ఒక్కసారిగా తెలుగులో క్రేజ్ దక్కించుకున్నాడు. ఓవర్‌ నైట్‌లో స్టార్ అయ్యాడు. ఈ డబ్బింగ్ సినిమా తెలుగులో వంద రోజులకు పైగా ఆడి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ బిచ్చగాడు సినిమాతో కోలీవుడ్, టాలీవుడ్‌లో విజయ్ ఆంటోని సెన్సేషన్‌గా మారిపోయాడు. బిచ్చగాడు తరువాత మధ్యలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఏ ఒక్కటి కూడా క్లిక్ అవ్వలేదు.

అయితే ఇప్పుడు బిచ్చగాడు పార్ట్ 2కి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఇందులో కొన్ని షాట్స్ చూస్తుంటే కేజీయఫ్ సినిమాలోని షాట్స్‌ను పెట్టినట్టుగా అనిపిస్తోంది. చూస్తుంటే ఈ సినిమాను కూడా పాన్ ఇండియన్ రేంజ్లో రిలీజ్ చేయబోతోన్నట్టుగా తెలుస్తోంది. ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం కథను ఏ మాత్రం కూడా అంచనా వేయలేమన్నట్టుగా ఉంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News