Pushpaka Vimanam pre-release event: వైజాగ్‌లో పుష్పక విమానం ప్రీ-రిలీజ్ ఈవెంట్

Pushpaka Vimanam pre-release event: తన సోదరుడు ఆనంద్ దేవరకొండను (Anand Deverakonda) హీరోగా ప్రమోట్ చేసుకునేందుకు నడుం బిగించిన విజయ్ దేవరకొండ.. పుష్పక విమానం ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2021, 04:40 AM IST
Pushpaka Vimanam pre-release event: వైజాగ్‌లో పుష్పక విమానం ప్రీ-రిలీజ్ ఈవెంట్

Pushpaka Vimanam pre-release event: విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'పుష్పక విమానం' సినిమా ఈ నెల 12న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి రానుంది. దామోదర దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ సరసన శాన్వి మేఘన, గీత్ సైనీ హీరోయిన్స్‌గా నటించారు. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ నెల 7న వైజాగ్‌లో పుష్పక విమానం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. 

తన సోదరుడు ఆనంద్ దేవరకొండను (Anand Deverakonda) హీరోగా ప్రమోట్ చేసుకునేందుకు నడుం బిగించిన విజయ్ దేవరకొండ.. పుష్పక విమానం ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అందులో భాగంగానే ఈ నెల 10న మహబూబ్ నగర్‌లోని తమ సొంత థియేటర్ ఏవీడీ సినిమాస్‌లో పుష్పక విమానం మూవీ స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. ఈ స్పెషల్ ప్రీమియర్ షోకు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా హాజరుకానున్నాడు. 

విజయ్ దేవరకొండ ప్రజెంట్ చేసిన పుష్పక విమానం ట్రైలర్‌ను (Pushpaka Vimanam trailer) ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తోన్న యువకుడు తన పెళ్లి తర్వాత ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు.., వాటిని ఎలా అధిగమించాడనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కినట్టు పుష్పక విమానం ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే.. రేపు నవంబర్ 7న జరిగే పుష్పక విమానం ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pushpaka Vimanam pre-release event) లేదా 12న సినిమా రిలీజయ్యే వరకు వేచిచూడాల్సిందే.

Trending News