Vishwak Sen: టాక్ హిట్.. కలెక్షన్స్ ఫ్లాప్.. ఇదేందయ్యా ఇది.. !

Gangs of Godavari Review: యంగ్ హీరో విశ్వక్ సేన్ మిగతా హీరోలతో పోలిస్తే ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. కానీ ఎంత కొత్తదనం ఉన్న సినిమాలు తీస్తున్నప్పటికీ.. మంచి రివ్యూస్ అయితే అందుకోగలుగుతున్నాడు.. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించలేకపోతున్నాడు…దీనికి కారణం ఏమై ఉండొచ్చు?

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 7, 2024, 07:20 PM IST
Vishwak Sen: టాక్ హిట్.. కలెక్షన్స్ ఫ్లాప్.. ఇదేందయ్యా ఇది.. !

Gangs of Godavari Collections: ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఇప్పుడు టాలీవుడ్ లో తనకంటూ.. ఒక గుర్తింపు తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. కొత్తదనం ఉండే సినిమాలను.. ఎంపిక అయితే చేసుకుంటున్నాడు.. కానీ వాటితో బ్లాక్ బస్టర్లు మాత్రం అందుకోలేకపోతున్నాడు ఈ యువ హీరో. 

దాస్ కా దమ్ కి సినిమాకి మంచి టాక్ వచ్చింది. సినిమాకి చాలా వరకు పాజిటివ్ రివ్యూస్ మాత్రమే వచ్చాయి. వారాంతంలో బాగానే కలెక్షన్లు..అందుకున్న ఈ సినిమా.. వారాంతం పూర్తి కాగానే బాక్స్ ఆఫీస్ వద్ద డీల పడిపోయింది. సోమవారం నుంచి సినిమాకి కలెక్షన్లు భారీగా పడిపోయాయి.

ఆ తర్వాత వచ్చిన..గామి సినిమాకి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ముందు నుంచి మంచి బజ్ తో విడుదలైన ఈ సినిమా.. మొదట్లో మంచి రివ్యూస్ అందుకుంది. ఈ సినిమాతో విశ్వక్ సేన్ మరే హీరో కూడా చేయలేని రిస్క్ చేశాడని..చాలామంది ప్రశంసల వర్షం కురిపించారు. కానీ సినిమా మాత్రం వారంతంలో బాగానే ఆడి ఆ తరువాత కలెక్షన్లు బాగా డ్రాప్ అయిపోయాయి. 

ఇప్పుడు మళ్లీ.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. సినిమాకి మంచి టాక్ లభించింది. కానీ మళ్లీ వారాంతం పూర్తయ్యేసరికి.. కలెక్షన్లు చాలా తగ్గిపోయాయి. అయితే మంచి రివ్యూస్ అందుకుంటున్న విశ్వక్ సేన్ సినిమాలు.. బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం బోర్లా పడుతూ ఉండటానికి కారణాలు ఏంటి అని.. సోషల్ మీడియాలో చర్చ కూడా మొదలైంది. 

తన సినిమాలలో కొత్తదనం ఉన్నప్పటికీ చాలా వరకు కమర్షియల్ ఫార్మాట్ లోనే నడుస్తూ ఉంటాయి. విశ్వక్ సేన్ కూడా ఎంత కొత్తదనం ఉన్న స్క్రిప్టులు ఎంచుకున్నా కూడా అదే కమర్షియల్ ఫార్మేట్ ను మాత్రం వదిలిపెట్టడం లేదు. అది కూడా తన సినిమాలు మంచి కలెక్షన్లు అందుకోలేక పోవడానికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు. 

మరి ఇకనైనా స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో విశ్వక్ సేన్ తగిన జాగ్రత్తలు వహిస్తాడో లేదో చూడాలి. ఒకవేళ ఇప్పటికీ కూడా విశ్వక్ సేన్.. తన రూట్ మార్చకపోతే ఇండస్ట్రీలో ఇప్పటిదాకా తెచ్చుకున్న గుర్తింపు దేనికి పనికి రాకుండా పోతుంది అని అభిమానులు కూడా కంగారుపడుతున్నారు.

Read more: Snakes repellent plants: ఈ చెట్లంటే పాములకు ఎంతో భయం.. ఆ ఇళ్లవైపు కన్నేత్తి కూడా చూడవంట..

Read more: Viral Video: కొంప ముంచిన సెల్ఫీ సరదా.. వైరల్ గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News