VishwakSen: విశ్వక్ సేన్ కొత్త గెటప్.. హీరోయిన్స్ కూడా కుళ్లుకునేలా..?

Vishwak Sen as Laila: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తరువాత ప్రస్తుతం విశ్వక్ సేన్ లైలా.. సినిమాలో నటిస్తున్నారు. ఇందులో అమ్మాయిగా నటించబోతున్న విషయాన్ని రివీల్ చేస్తూ.. విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో ఉన్న పోస్టర్ను రిలీజ్ చేశారు.. కాగా ఈ పోస్టర్ తో ఈ సినిమా పైన హైప్ పెంచేశారు చిత్ర బృందం.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 3, 2024, 11:44 AM IST
VishwakSen: విశ్వక్ సేన్ కొత్త గెటప్.. హీరోయిన్స్ కూడా కుళ్లుకునేలా..?

VishwakSen: స్టార్ హీరోలు ఎప్పుడూ హీరోగానే.. కాకుండా సరికొత్త పాత్రలతో అలరించాలని ఆరాటపడుతూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది మరీ ఎక్కువగా ధైర్యం చేసి..లేడీ గెటప్ లలో  కూడా కనిపించాలని ప్రయత్నాలు.. చేస్తూ ఉంటారు. ఇప్పటికే చిరంజీవిని మొదలుకొని.. రాజేంద్రప్రసాద్ వరకు ఇలా చాలామంది హీరోలు లేడీ గెటప్లలో కనిపించి అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా అమ్మాయిగా మారిపోయాడు. ఇక తాజాగా ఈయన నటిస్తున్న చిత్రం లైలా.. ఈ సినిమాలో మొదటిసారి అమ్మాయిగా కనిపించబోతున్నారు విశ్వక్ సేన్. తాజాగా విశ్వక్ సేన్ లేడీ గెటప్ కి సంబంధించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో విడుదల అవ్వడంతో ఇది కాస్త చాలా వైరల్ గా మారింది. 

ప్రస్తుతం విశ్వక్ సేన్  వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.. గామీ,  గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్.. విజయాలను అందుకున్న ఈయన.. త్వరలో మెకానిక్ రాఖీ అనే సినిమాతో కూడా రాబోతున్నారు.. ఇప్పుడు మరో కొత్త సినిమా మొదలు పెట్టేసారు.. గతంలోనే లైలా సినిమా చేస్తున్నట్టు విశ్వక్ ప్రకటించిన విషయం తెలిసిందే..  షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ దర్శకత్వంలో వస్తున్న ఈ లైలా సినిమాలో విశ్వక్ మొదటిసారి అమ్మాయిగా కనిపించబోతున్నారు.  దీంతో సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది..  ఇక పైగా మాస్ హీరోగా ఎప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకునే విశ్వక్..  మొదటిసారి అమ్మాయిగా కనిపించబోతున్నాడు అని తెలిసి.. ఇప్పటి నుంచే అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది..  నేడు ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం పూర్తి అవ్వగా.. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే తాజాగా రివీల్ చేసిన పోస్టర్ లో  క్లోజ్ గా ఫేస్ మాత్రమే కనిపించేలా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు ఈ పోస్టర్ కాస్త చాలా వైరల్ గా మారుతోంది. అమ్మాయిగా విశ్వక్ సేన్ చాలా క్యూట్ గా ఉన్నాడు అని.. అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.. అంతేకాదు విశ్వక్ గెటప్ చూసి హీరోయిన్లు సైతం కుళ్ళుకోవడం ఖాయం అంటూ నెటిజెన్లు సరదాగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.. ఇకపోతే లేడీ గెటప్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు.. మరి ఈ సినిమాతో విశ్వక్ సేన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. మొత్తానికైతే లేడీ గెటప్ లో చాలా ముద్దుగా అమ్మాయిలు సైతం ఈర్ష పడేలా కనిపిస్తున్నారు విశ్వక్ సేన్.

 

Also Read: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలనం.. 9 నెలల యువతి కేసు 9 రోజుల్లో పరిష్కారం

Also Read: C Naga Rani IAS: వెస్ట్‌ గోదావరికి పవర్‌ ఫుల్‌ ఆఫీసర్‌.. ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే అందరికీ హడలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News