Waltair Veerayya Day 11: మాగా మాస్ కు అడ్డే లేదు.. 200 కోట్లను టచ్ చేసేసిందిగా!

Waltair Veerayya Day 11 Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవితేజ కీలక పాత్రలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా కలెక్షన్స్ 11 రోజులకు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం  

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 24, 2023, 04:17 PM IST
Waltair Veerayya Day 11: మాగా మాస్ కు అడ్డే లేదు.. 200 కోట్లను టచ్ చేసేసిందిగా!

Waltair Veerayya 11 Days Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవితేజ కీలక పాత్రలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో బాబి డైరెక్ట్ చేసిన చిత్రం వాల్తేరు వీరయ్య. వింటేజ్ మెగాస్టార్ ని మళ్లీ ఆయన అభిమానులకు అందించిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. శృతిహాసన్, కేథరిన్ తెరిసాలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో కనిపించాడు.

ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్లుగా సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి సినిమా మీద భారీ వసూళ్ల వర్షం అయితే కురుస్తోంది. ఈ సినిమా విడుదలయి ఇప్పటికే 11 రోజులు రన్ పూర్తి చేసుకోగా పదవ రోజుతో పోలిస్తే 11వ రోజు భారీ డ్రాప్ కనిపించింది.

అయినా సరే వీరసింహారెడ్డి సినిమాతో పోలిస్తే 11వ రోజు కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టినట్లయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో పదవరోజు అంటే ఆదివారం నాడు ఆరు కోట్ల 66 లక్షలు వసూలు చేసిన ఈ సినిమా 11వ రోజున కేవలం కోటి 90 లక్షల మాత్రమే వసూలు చేసింది. తద్వారా ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో 96 కోట్ల 93 లక్షల షేర్ 150 కోట్ల 25 లక్షల గ్రాస్ వసూలు చేసింది.

అలాగే ఇప్పటివరకు 11 రోజులకు గాను కర్ణాటక సహా మిగతా భారతదేశం అంతా కలిపి ఏడు కోట్ల 55 లక్షలు షేర్ వసూలు చేస్తే ఓవర్సీస్ లో 12 కోట్ల 45 లక్షల షేర్ వసూళ్లు రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 117 కోట్ల మూడు లక్షల షేర్ 200 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది వాల్తేరు వీరయ్య. ఇక ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ 88 కోట్లకు జరుపుకోవడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్గా 89 కోట్లు నిర్ణయించారు. ఇప్పటికే లాభాల బాట పట్టిన ఈ సినిమా 28 కోట్ల మూడు లక్షల లాభాలతో దూసుకుపోతోంది.

Also Read: Veera Simha Reddy Day 12 : ఎట్టకేలకు హిట్ కొట్టేసిన బాలయ్య.. లాభం ఎంత అంటే?

Also Read: Akkineni Fans: మీ అహంకార, కుల మత్తు మాటలు కట్టిపెట్టి అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News