Waltair Veeraiah: చిరంజీవి రాజకీయాలకు పనికిరాడు, వాల్తేరు వీరయ్య వేడుకలో దర్శకుడు బాబీ కీలక వ్యాఖ్యలు

Waltair Veeraiah: అంతా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ మూవీ గురించే చర్చ నడుస్తోంది. విశాఖ ఏయూ గ్రౌండ్స్‌లో జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుకలో వక్తలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 8, 2023, 11:11 PM IST
Waltair Veeraiah: చిరంజీవి రాజకీయాలకు పనికిరాడు, వాల్తేరు వీరయ్య వేడుకలో దర్శకుడు బాబీ కీలక వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ వేడుక విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకలో చిత్ర దర్శకుడు బాబీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

సంక్రాంతికి విడుదల కానున్న చిరంజీవి, రవితేజల సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమా ప్రీ రిలీజు వేడుక విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో అత్యంత ఘనంగా జరిగింది. భారీగా జనం తరలివచ్చారు. ఈ వేడుక సందర్భంగా చిత్ర దర్శకుడు బాబీ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. చిరంజీవి రాజకీయాలపై బాబీ చేసిన వ్యాఖ్యలు సంచలనమౌతున్నాయి. చిరంజీవికి రాజకీయాలు ఒక్క శాతం కూడా రాదని, అతనికి సరిపడదని వ్యాఖ్యానించాడు. రాజకీయాలు చూసుకునేందుకు చిరంజీవికి దేవుడు గొప్పు తమ్ముడినిచ్చాడని చెప్పాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో గట్టిగా నిలబడనున్నాడని..ప్రత్యర్ధులకు తగిన రీతిలో సమాధానమిస్తాడన్నాడు. చిరంజీవిలో ఆవేశం, మంచితనం కలిపితే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అని ప్రశంసలు కురిపించాడు. తాను చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరితో పనిచేశానని..ఇరువురిలో మంచితనం, ప్రేమ చూశానన్నాడు. మాటకు మాట, కత్తికి కత్తి అనే పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలు సరిగ్గా సెట్ అవుతాయని దర్శకుడు బాబీ తెలిపాడు.

Also read: KGF Chapter 3: కేజీఎఫ్ ఛాప్టర్ 3 షూటింగ్ ఎప్పుడో చెప్పెసిన నిర్మాతలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News