Bhagavanth Kesari: జీ తెలుగులో ఆదివారం హంగామా…భగవంత్ కేసరి ప్రీమియర్…కూతురు ఉంటే సర్ప్రైజ్ గిఫ్ట్ మీ సొంతం..

Zee Telugu: జీ తెలుగులో ఈ ఆదివారం అనగా జనవరి 28న ఎంటర్టైన్మెంట్ దోస్ పెరగనుంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ భగవంత్ కేసరి, డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ జోడీ ప్రారంభం తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయింది జీ తెలుగు ఛానల్.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2024, 05:33 PM IST
Bhagavanth Kesari: జీ తెలుగులో ఆదివారం హంగామా…భగవంత్ కేసరి ప్రీమియర్…కూతురు ఉంటే సర్ప్రైజ్ గిఫ్ట్ మీ సొంతం..

Bhagavanth Kesari Digital Premiere::తెలుగు ప్రేక్షకులకు సరికొత్త కాన్సెప్ట్స్తో అలరించే జీ తెలుగు ఈ ఆదివారం మరింత వినోదం అందించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ ఆదివారం అందిస్తోంది. అంతేకాదు, తెలుగు ప్రేక్షకులను బుల్లితెర, వెండితెరపై అలరిస్తున్న తారలు తమ జోడీతో కలిసి జంటగా తమలోని ప్రతిభను నిరూపించుకునేందుకు సూపర్ జోడీ వేదికను అందిస్తోంది జీ తెలుగు. 

నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ భగవంత్ కేసరి ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు.. స్ట్రీమింగ్ కానుండగా. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా సూపర్ జోడి రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది.

సక్సెస్ఫుల్ నాన్ఫిక్షన్ షోలతో అలరించిన జీ తెలుగు ఈ ఆదివారం సెలబ్రిటీ డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ జోడిని ప్రారంభిస్తోంది. జీ తెలుగులో జనవరి 28న టాలీవుడ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా ప్రారంభం కానున్న సూపర్ జోడీ ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. 

చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రముఖ యాంకర్ ఉదయ భాను జీ తెలుగు సూపర్ జోడి షోతో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ షోకి న్యాయనిర్ణేతలుగా ఎవర్గ్రీన్ నటి మీనా, ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ వ్యవహరించనున్నారు. ఈ షోతో మీనా తెలుగు బుల్లితెరపై మొదటిసారి జడ్జిగా అలరించనున్నారు. రఘు మాస్టర్ కొరియోగ్రఫీ అనుభవం, శ్రీదేవి విజయ్ కుమార్ అందం ఈ  షోని మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయి. 

ఇక, ఈ షోలో 8 మంది సెలబ్రిటీ జోడీలు తమ అద్భుతమైన ప్రదర్శనలతో హోరాహోరీగా టైటిల్ కోసం పోటీపడనున్నారు. ఆ సెలబ్రిటీ జోడీలు ఎవరనేది తెలియాలంటే.. ఉత్కంఠభరితమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న సూపర్ జోడి ఎపిక్ ప్రీమియర్ ఎపిసోడ్లు చూడాల్సిందే.

మరోపక్క ప్రేక్షకులను మెప్పించి బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచిన భగవంత్ కేసరి సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా జీ తెలుగు అందిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కథ జైలు నుండి విడుదలైన మాజీ పోలీస్ అధికారి నేలకొండ భగవంత్ కేసరి(బాలకృష్ణ) పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించగా అర్జుల్ రాంపాల్, పి. రవిశంకర్, ఆర్. శరత్ కుమార్, రఘుబాబు ఇతర కీలకపాత్రల్లో నటించారు. యాక్షన్, ఎమోషన్స్, కెమిస్ట్రీ అన్నింటి మేళవింపుగా సాగిన భగవంత్ కేసరి సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా మీ జీ తెలుగులో ఈ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రసారం కానుంది. 

ఈ సందర్భంగా జీ తెలుగు ‘బనావో బేటీకో షేర్’ కాంటెస్ట్ని నిర్వహించనుంది. ఆడపిల్లల్ని పులిలా పెంచుతున్న తల్లిదండ్రులకి జోహర్లు చెబుతూ నిర్వహిస్తున్న ఈ కాంటెస్ట్లో పాల్గొనాలంటే భగవంత్ కేసరి సినిమా చూస్తూ మీ కూతురితో సెల్ఫీ తీసి టీవీలో కనిపించే ఫోన్ నంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వాలి, లేదా స్క్రీన్పై కనిపించే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి సెల్ఫీని పంపించాలి. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారు సర్ప్రైజ్ గిఫ్ట్ని పొందుతారు. భగవంత్ కేసరి సినిమా చూడండి.. మీరు కూడా ఈ పోటీలో పాల్గొనండి.

ఈ ఆదివారం అంతులేని వినోదం.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ భగవంత్ కేసరి, డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ జోడి.. మీ జీ తెలుగులో, తప్పక చూడండి!

Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?

Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News