Allu Arjun: బన్నీ - రామ్ చరణ్ మధ్య ఎక్కడ చెడింది..?

Ram Charan: అల్లు అర్జున్..ని అరెస్ట్ చేయడంతో.. సినీ సెలబ్రిటీస్ అందరూ ఏకమైన సంగతి తెలిసిందే. ఆ అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే.. సెలబ్రిటీస్ అందరూ వెళ్లి అల్లు అర్జున్ ని కలిశారు. మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్కి ఏవో గొడవలు జరుగుతున్నాయి అన్న విషయం ప్రస్తుతం ప్రచారం అవుతున్నా కానీ.. చిరంజీవి, నాగబాబు కూడా అల్లు అర్జున్ ని విషయం తెలిసిన వెంటనే చేరుకున్నారు. ఇలాంటి క్రమంలో రామ్ చరణ్ గురించి ఒక వార్త మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

Last Updated : Dec 15, 2024, 12:33 PM IST

Allu Arjun - Ram Charan: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అల్లు,  మెగా కుటుంబాల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా పుష్ప 2 సినిమా విడుదలై రూ.1000 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 

అయితే అనూహ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 బెనిఫిట్ షో వేయగా అక్కడ అల్లు అర్జున్ ర్యాలీ నిర్వహించారు. దాంతో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది..ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కూడా మరణించింది. ్ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేసు ఫైల్ చేయగా ఆయనను చంచల్గూడా జైల్లో ఒకరోజు రాత్రంతా ఉంచారు. క్వాష్ పిటిషన్ మీద బెయిల్ వచ్చిన సరే ఒక రోజంతా జైల్లోనే గడపాల్సి వచ్చింది అల్లు అర్జున్. 

ఇకపోతే అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకు రావడంతో ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా అల్లు అర్జున్ ఇంటికి నేరుగా వచ్చి మరి పరామర్శిస్తున్నారు. ఇక రానా వెంకటేష్ నాగచైతన్య ప్రభాస్ వంటి వారు కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి పరామర్శిస్తున్నారు. 

ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..

అలాగే అల్లు అర్జున్ ను పరామర్శించడానికి చిరంజీవి, సురేఖ, నాగబాబు కూడా వచ్చారు. అయితే మిగతా హీరోలు ఎవరూ కూడా ఇక్కడ కనిపించలేదు..దీనికి తోడు రామ్ చరణ్ వస్తారని అందరూ అనుకున్నా ఆయన మాత్రం రాలేదు. అయితే విమర్శలకు దారి తీసేలా రాణా బర్తడే రోజున పోస్ట్ చేశారు రామ్ చరణ్ . అయితే బర్తడే బాయ్ రానా మాత్రం అల్లు అర్జున్ ని పరామర్శించడానికి వెళ్లారు. 

మరికొంతమంది ఫోన్లో పరామర్శించి ఉంటారని కామెంట్లు చేయగా బంధువు కాబట్టి సభ్యత కాదు.. మరి అసలు విషయం ఏం జరిగింది.. నిజంగానే వీరిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకోలేదా.. అసలు పరిస్థితి ఏంటి అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా అల్లు అర్జున్ రామ్ చరణ్ మధ్య ఏముందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఈ విషయాలు మరింత వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం.

ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News