Women’s Day సందర్భంగా Rhea Chakraborty ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్

Rhea Chakraborty's insta post on Women’s Day: రియా చక్రవర్తి .. బాలీవుడ్ లోనే కాదు.. దేశంలో ఏ ఒక్క భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల వారికి సుపరిచితమైన పేరు ఇది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అకాల మృతి తర్వాత రియా చక్రవర్తి పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2021, 05:44 PM IST
  • సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు తర్వాత ఆరు నెలలకు తొలిసారిగా రియా చక్రవర్తి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.
  • గతేడాది అక్టోబర్‌లో బెయిల్‌పై విడుదలైన Actress Rhea Chakraborty.
  • Women's day సందర్భంగా ఇన్‌స్టా పోస్ట్ చేసిన రియా.
Women’s Day సందర్భంగా Rhea Chakraborty ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్

Rhea Chakraborty's insta post on Women’s Day: రియా చక్రవర్తి .. బాలీవుడ్ లోనే కాదు.. దేశంలో ఏ ఒక్క భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల వారికి సుపరిచితమైన పేరు ఇది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అకాల మృతి తర్వాత రియా చక్రవర్తి పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. సినిమాలతో వచ్చిన గుర్తింపు కొంతే అయితే, సుశాంత్ మృతి తర్వాత అతడికి డ్రగ్స్ సరఫరా చేసి అతడి చావుకు కారణమైన ప్రియురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటూ Bollywood drugs case లో నిందితురాలిగా విచారణ ఎదుర్కొన్న తర్వాత వచ్చిన పేరే ఎక్కువ. 

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన అనంతరం ఇటీవలే బెయిల్‌పై బయటికొచ్చిన Rhea Chakraborty పై ముంబై కోర్టు ఎన్నో షరతులు విధించింది. Sushant Singh Rajput death case నమోదైంది మొదలు ఆమె బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చే వరకు ఎన్నో అవమానాలు, అనుమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాకు దూరమైన రియా చక్రవర్తి.. సుశాంత్ మృతి తర్వాత ఆరు నెలలకు ఇవాళ International Women's Day సందర్భంగా తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టిందామె.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)

Also read : Rhea Chakraborty gets bail: రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు.. కానీ..

Women's Day celebrations సందర్భంగా తన తల్లి చేయిని పట్టుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రియా చక్రవర్తి... ''తన బలం, ఆత్మవిశ్వాసం, తన నమ్మకం, తన స్పూర్తి.. అన్నీ అమ్మే'' అంటూ క్యాప్షన్ రాసింది. Actress Rhea Chakraborty Instagram post పై హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానే ఖాన్‌తో పాటు శివాని దండేకర్ హార్ట్ సింబల్ ఇచ్చి లైక్ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News