YS Jagan Sensational Comments Mentioning Pawan Kalyan Wifes: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భార్యల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు విషయం ఏమిటంటే తన సొంత వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్ ఈరోజు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కమలాపురం నియోజకవర్గం లో సుమారు 900 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన తర్వాత కమలాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు చేయడం చాలా సంతోషంగా ఉందని పలు అభివృద్ధి కార్యక్రమాలకు సైతం శ్రీకారం చుట్టామని అన్నారు. ఇక ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అని అనడం లేదు ఇదే నా రాష్ట్రం ఇక్కడే నా రాజకీయం అంటూ ఎమోషనల్ అయ్యారు.
చంద్రబాబు లాగా ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రం అని నేను మాట్లాడను అని ఆయన దత్తపుత్రుడు అంటే పవన్ కళ్యాణ్ లాగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని నేను అనడం లేదని జగన్ కామెంట్ చేశారు. నేను ఏపీలోనే ఉంటానని పేర్కొన్న జగన్ ఐదు కోట్ల ప్రజలే తన కుటుంబంగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇంటింటా సంతోషం నింపడమే తన విధానం అని ఆయన పేర్కొన్నారు.
రాజకీయ నాయకుడికి విశ్వసనీయత చాలా ముఖ్యమని పేర్కొన్న జగన్ ఇదే నా రాష్ట్రం ఇదే నా కుటుంబం ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ విధానం అని పేర్కొన్నారు. గతంలో కూడా వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపాయి. తర్వాత పవన్ కూడా దీని మీద స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుంది అనేది చూడాల్సి ఉంది.
Also Read: Vijay Most popular star: ఒక్క పాన్ ఇండియా మూవీ లేకుండా పాన్ ఇండియా నెం1 అంటే నమ్మడమెలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.