ఈ నెల 21 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘అలా ఇలా ఎలా’

దర్శకుడు .వాసు కొడుకు శక్తి వాసుదేవన్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'అలా ఇలా ఎలా'. ఈ చిత్రాన్ని కళ మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మించగా.. రాఘవ దర్శకత్వం వహించారు. ఈ నెల 21న గ్రాండ్ గా విడుదల కానుంది 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 17, 2023, 04:31 PM IST
ఈ నెల 21 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘అలా ఇలా ఎలా’

దర్శకుడు .వాసు కొడుకు శక్తి వాసుదేవన్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'అలా ఇలా ఎలా'. ఈ చిత్రంలో నిషా కొఠారి, సితార, సీత, అలీ, బ్రహ్మానందం, నాగబాబు, పూర్ణ మరియు రాజ్ శంకర్ తదితరులు నటించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కళ మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మించగా.. రాఘవ దర్శకత్వం వహించారు. మణిశర్మ మ్యూజిక్ అందించగా.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి మరియు టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్.కె.ఎం. ఎల్. మోషన్ పిక్చర్స్ సంస్థ ద్వారా జూన్ 21 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. దీంట్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సినిమాకి శుభాకాంక్షలు తెలియజేసారు. 

అతిధిగా వచ్చిన డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఫ్యాన్సీ టైటిల్ తో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని.. సినిమా తీసిన నిర్మాత, దర్శకుడు మంచి లాభాలు రావాలని ఆశించారు. అథితిగా వచ్చిన కొరియోగ్రాఫర్ అశోక్ మాట్లాడుతూ.. 'నేను ఈ సినిమా చూసాను.. దర్శకుడు, నిర్మాత పాషన్ తో ఈ సినిమాని తీశారు. నటీనటులు అద్భుతంగా నటించారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నిర్మాత నాగరాజు గారు ఇలాంటి మరెన్నో సినిమాలు తీయాలని కోరారు".

చిత్ర నిర్మాతగా వ్యవహరించిన నాగరాజు మాట్లాడుతూ.. సినిమాలో అందరు బాగా నటించారు. ముఖ్యంగా హీరో శక్తి చాలా బాగా నటించాడు. సినిమా చూస్తున్నంత మేరకు ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు. ఈ సినిమాలో నటించిన సీనియర్ నటులు రియాజ్ ఖాన్, నాగబాబు, షియాజీ షిండే, పూర్ణ, అలీ, బ్రహ్మానందం అందరు బాగా నటించారు. ఈ సినిమాలో నటించిన నటులు, టెక్నిషియన్స్ అందరు కలిసి సపోర్ట్ చేయటంతో సినిమా బాగా వచ్చింది. 'అలా ఎలా ఇలా' సినిమాని అందరు చూసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని అంటున్నారు. 

సినిమా దర్శకుడు రాఘవ మాట్లాడుతూ.. చిరంజీవి సినిమాలు చూసి సినిమాలపై ఆసక్తి పెరిగింది. తమిళంలో ఒక సినిమా కన్నడలో 6 సినిమాలు చేశాను. ఇది నా మొదటి తెలుగు సినిమా.. మంచి కాన్సెప్ట్.. స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా.. తరువాత ఏం జరగబోతుంది అని మాత్రం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. సిరివెన్నెల సీతారామ శాస్రితో వర్క్ చేయడం చాలా అదృష్టంగా  భావిస్తున్నా.. సినిమాకి కొల్లకుంట నాగరాజు  బాక్ బోన్.. డిస్ట్రిబ్యూటర్ ఆదినారాయణ గారు  సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చి మా సినిమాను విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. నటించిన వారంతా చాలా బాగా నటించారు. ఈనెల 21 న విడుదల అవుతున్న మా సినిమాను బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

Also Read: AP Team in IPL: ఐపీఎల్‌లో ఏపీ టీమ్.. రూట్ మ్యాప్ సిద్ధం  

హీరోగా నటించిన శక్తి మాట్లాడుతూ.. నాకిది మొదటి తెలుగు సినిమా.. ఇది మంచి కాన్సెప్ట్.. ఇంత మంచి సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు' తెలిపారు. డిస్ట్రిబ్యూటర్ ఆదినారాయణ మాట్లాడుతూ.. ఈ సినిమాలో శక్తి గారు హీరోగా, విలన్ గా రెండు పాత్రల్లో కూడా అద్భుతంగా  నటించారు. ఈ సినిమా ద్వారా తనకు మంచి పేరు వస్తుంది. నిర్మాత నాగరాజు ఈ సినిమా కొరకు చాలా కష్టపడి నిర్మించారు. ఈ నెల 21 న విడుదల అవుతున్న ఈ సినిమా 250 థియటర్స్ లలో రిలీజ్ అవుతుందని అన్నారు.

నటీనటులు :
శక్తి వాసుదేవన్, రాజా శేఖర్, పూర్ణ, షియాజీ షిండే, నాగబాబు, రియాజ్ ఖాన్, బ్రహ్మానందం, అలీ, నిషా కొఠారి, హరిప్రియ, సితార, రేఖ, సీత తదితరులునిర్మాత : కొల్లకుంట నాగరాజు
దర్శకుడు : రాఘవ
కెమెరా మాన్ : పి కె హెహ్ దాస్
సంగీతం : మణిశర్మ
ఎడిటర్ : జాషి ఖ్మెర్
పీఆర్వో :  సాయి సతీష్

Also Read: Team India: బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీకి రెడీ.. ఆ బౌలర్ మాత్రం ఎప్పుడంటే..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News