ఛాయ్ వాలా టూ ప్రధాని జర్నీ: మోడీ మూవీకి ప్రభాస్ ప్రమోషన్ !!

భారత ప్రధాని మోడీ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న మూవీకి సంబందించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు

Last Updated : Sep 17, 2019, 03:19 PM IST
ఛాయ్ వాలా టూ ప్రధాని జర్నీ: మోడీ మూవీకి ప్రభాస్ ప్రమోషన్ !!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి జీవితం ఆధారంగా మరో బ‌యోపిక్ రూపొందుతోంది. ఛాయ్ అమ్మకునే స్థాయి నుంచి దేశ ప్రధాని ఎలా ఎదిగిన ఆయనక జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి `మ‌న్ బైరాగి` అనే టైటిల్‌ను ఖ‌రారు చేయగా ...తెలుగులో ఈ చిత్రాన్ని తెలుగులో `మ‌నో విరాగి` పేరుతో పెట్టారు. బాలీవుడ్ టాప్ డైరక్టర్ సంజ‌య్ త్రిపాఠి డైరక్షన్ లో రూపొందుతున్న ఈ బ‌యోపిక్‌ను సంజ‌య్ లీలా భ‌న్సాలి, మ‌హావీర్ జైన్ నిర్మిస్తున్నారు. కాగా న‌రేంద్ర మోడీ 69వ పుట్టిన రోజు (సెప్టెంబ‌ర్ 17) సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. 

ఈ సినిమా హిందీ, తెలుగు వెర్ష‌న్ పోస్ట‌ర్స్‌ను యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ త‌న ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుద‌ల చేశారు. ప్రత్యేకమైక వ్యక్తిపై ప్రత్యేకమైన నిర్మాతలు తీస్తున్న ప్రత్యేక సినిమాను ప్రత్యేకమైన రోజును విడుల చేస్తున్నాం. హ్యాపీ బ‌ర్త్ డే న‌రేంద్ర‌మోదీ సర్. దిగ్గజ మూవీ మేకర్స్ సంజ‌య్ లీలా భ‌న్సాలి, మ‌హావీర్ జైన్ నిర్మిస్తోన్న `మ‌న్ బైరాగి` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నరేంద్ర మోదీగారి జీవితానికి సంబంధించిన అన్‌టోల్డ్ స్టోరీ ఇది. సంజ‌య్ త్రిపాఠి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు` అంటూ మెసేజ్‌ను కూడా ప్ర‌భాస్ పోస్ట్ చేశారు.

 

Trending News